Advertisement
Google Ads BL

క్షమాపణలు చెబుతున్నారు -విష్ణువర్దన్ ఇందూరి


తలైవి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. -నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి

Advertisement
CJ Advs

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన‌ చిత్రం తలైవి. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేశారు. తలైవి సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న సినిమా విడుదల కాగా.. విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి సినీజోష్ తో ముచ్చటించారు.

తలైవి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. మంచి సినిమా చేశాను అనే ప్రశంసలు కూడా వచ్చాయి. అదే సమయంలో పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. అలా వ్యాపారపరంగా లాభాలు కూడా వచ్చాయి. మొత్తానికి తలైవి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది.

నాన్ థియేట్రికల్ రైట్స్‌‌తో బడ్జెట్ మొత్తం రికవరీ అయింది. సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడింది. కానీ నిర్మాతగా నా పరంగా చూస్తే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఏ నిర్మాత కూడా తన సినిమాను వారం ముందే అందరికీ చూపించరు. కానీ నేను చూపించాను. నా సినిమా మీద నాకున్న నమ్మకం అదే. ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ రోజు హాయిగా నిద్రపోయాను. ఎందుకంటే మేం థియేటర్ రెవెన్యూ మీద ఆధారపడలేదు. తీసుకున్న ఫైనాన్స్ కట్టి సినిమా రిలీజ్ చేయాలంటే నా ముందు ఆప్షన్ అదే. నా నిర్ణయాన్ని మా టీం మొత్తం సమర్థించింది. ఇలాంటి సమయంలో సినిమాను తీయడం కష్టం అనుకుంటే.. రిలీజ్ చేయడం మరింత కష్టం.

సినిమాను థియేటర్ కోసమే తీశాం. ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా మొదటి ప్రాధాన్యం థియేటర్లే. కానీ పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. దాంతో నాన్ థియేట్రికల్ రెవెన్యూ బాగానే వచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా హిట్ అయిందా? లేదా? అని బాక్సాఫీస్ లెక్కల్ని పట్టి చెప్పలేం. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయా? లేదా? మన సినిమాను ఎంత ఎక్కువ మంది చూశారు అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం.

మా సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. జయలలిత గారు చనిపోయినప్పుడు రెండు మూడు రోజులు తిండి తినలేదు.. నిద్రపోలేదు. ఆమె బతికి ఉన్నప్పుడు బృంద అంత కనెక్ట్ అవ్వలేదేమో కానీ జయలలిత చనిపోయిన తరువాత మాత్రం చాలా కనెక్ట్ అయింది. జయలలిత గురించి ప్రపంచం తెలుసుకోవాలనేది ఆమె ఐడియా. అయితే ప్రాంతీయ చిత్రంగా కాకుండా పాన్ ఇండియన్ మూవీగా తీయాలని అనుకున్నారం. తమిళ భావాలు కనిపించాలనే ఉద్దేశ్యంతో విజయ్‌ను దర్శకుడిగా తీసుకున్నాం. ఇక ఇలాంటి కథను రాయాలంటే.. విజయేంద్ర ప్రసాద్ కంటే గొప్ప వారు ఎవరని అనుకున్నాం. ఇక కంగనాను హీరోయిన్‌గా తీసుకున్నప్పుడు అందరూ బ్యాడ్ చాయిస్ అని అన్నారు.

జయలలిత సినిమాలో ఆమె కంటే ఎక్కువగా ఎంజీఆర్ పాత్ర ఉంటుంది. అంత ఇంపార్టెంట్ రోల్ కాబట్టే అరవింద్ స్వామిని తీసుకున్నాం. తక్కువ సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ కనిపించాలని అనుకున్నాం. అయితే కరోనా దెబ్బ పడటంతో బడ్జెట్, క్యాస్టింగ్ అన్నింటిని తగ్గించేద్దామని అన్నారు. కానీ మా నిర్మాతలు అందరూ సపోర్ట్ చేశారు. జయలలిత ఎన్ని కష్టాలు పడ్డారో గానీ.. సినిమాను తీయడానికి, రిలీజ్ చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాం.

కంగనా రనౌత్ తమిళ నాడులో అంతగా తెలియదు. మొదట్లో అందరూ నెగెటివ్ కామెంట్ చేశారు. కానీ సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ నాడు చేసిన ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ.. క్షమాపణలు చెబుతున్నారు. మేం తప్పుగా అనుకున్నాం.. మీ నిర్ణయమే సరైనది అని చెబుతున్నారు. అది నాకు సంతోషంగా అనిపిస్తోంది. మంచి సినిమా చేశామని వస్తోన్న ప్రశంసలు నిర్మాతగా నాకు సంతోషాన్ని ఇస్తోంది.

తలైవి సినిమా ఎలాంటి విమర్శలు రావడం లేదు. మొదట్లో సినిమాపై జయలలిత కుటుంబ సభ్యులు కేస్ వేశారు. కానీ సినిమా చూశాక వారి నిర్ణయం మారింది. జయలలితకు ఇంత కంటే గొప్ప నివాళిని ఎవరూ ఇవ్వలేరు అని అన్నారు. ఆమె మేనళ్లుడు దీపక్ ఫోన్ చేసి అభినందించాడు. తమిళ నాడులో స్క్రీన్లు పెంచే యోచనలో ఉన్నాం. రోజురోజుకూ థియేటర్లో జనాలు పెరుగుతున్నాయి. మొదటి సారి సింగిల్ స్క్రీన్‌లో సినిమా చూశామని అందరూ చెబుతున్నారు. ఇక కొంత మంది అయితే రెండు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా? అని అనుకుంటూ ఉంటారు.

నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. కథలో ఏదైనా ఫీల్ ఉంటేనే చెప్పాలనిపిస్తుంది. ఇంకా మూడు నాలుగు చిత్రాలు ప్లాన్ చేశాం. హిందీలో మంచి లైనప్స్ ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలు చెబుతాను. కపిల్ దేవ్ బయోపిక్ 1983 పెద్ద సినిమా. థియేటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం.

ఒకరిని గొప్పగా చూపించేందుకు మరొకరిని తక్కువ చూపించాల్సిన అవసరం లేదు. మా సినిమా కథ అది కాబట్టి అలా తీశాం. అవతల ఉన్న కరుణానిధి కూడా గొప్ప వ్యక్తి. కరుణానిధి, ఎంజీఆర్ ఇద్దరూ కూడా పరిస్థితుల వల్ల అపొజిషన్ అయిపోయారు.

సోషల్ మీడియా మీద ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. దాని పేరు ట్రెండింగ్. ఓ పెద్ద దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తాం. ప్రధానమంత్రి అధికారి కార్యాలయం చుట్టూ తిరిగే మరో కథను తెరకెక్కిస్తున్నాం. ఆజాద్ హింద్ అనే దేశభక్తి సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాం.

Producer Vishnuvardan Induri:

<span>I am very happy with the success of Talaivi movie&nbsp;</span>Producer Vishnuvardan Induri
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs