Advertisement
Google Ads BL

సాయి రామ్ శంకర్ రీసౌండ్ లుక్


కొంత విరామం త‌ర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో మ‌న ముందుకు వ‌స్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement
CJ Advs

ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రీసౌండ్ అని ప‌వ‌ర్‌ఫుల్‌ మరియు మాస్-అప్పీలింగ్ టైటిల్ ఖ‌రారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ రీసౌండ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఫస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే సాయి రామ్ శంక‌ర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఈ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉంబోతుందో ఈ పోస్ట‌ర్‌ సూచిస్తుంది

Sai Raam Shanka Resound First Look Out:

Sai Raam Shankar, SS Murali Krishna Resound First Look Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs