Advertisement
Google Ads BL

రవితేజ ఖిలాడి ఫస్ట్ సింగిల్


మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ఖిలాడి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌

Advertisement
CJ Advs

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవ‌ల ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి మీద తెర‌కెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ఇష్టం అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు. రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.. రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అద‌ర‌గొట్టారు. తెరపై ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

ఇక ఈ పాట‌కు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చారు. శ్రీ మణి అద్భుతమైన సాహిత్యం అందించగా.. హరి ప్రియ గానం అందరినీ ఆకట్టుకుంటోంది. యశ్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ కష్టపడుతున్నారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయ‌నున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, అనసూయ.

సాంకేతిక బృందం: కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ, నిర్మాత: సత్యనారాయణ కోనేరు, బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్, ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు, స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్, ఎడిటర్: అమర్ రెడ్డి, లిరిక్స్: శ్రీ మణి

స్టిల్స్: సాయి మాగంటి, మేకప్: ఐ శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి, ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు, పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్, కో డైరెక్టర్: పవన్ కేఆర్‌కే, ఆర్ట్: గాంధీ న‌డికుడిక‌ర్‌, పీఆర్ఓ: వంశీ-శేఖర్.

Ravi teja Khiladi First Single Release‌:

Ravi teja Khiladi First Single Release‌
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs