Advertisement
Google Ads BL

GST(గాడ్ సైతాన్ టెక్నాలజీ) కధ నే హీరో


GST(God Satan Technology) Movie Review

Advertisement
CJ Advs

GST(God Satan Technology) Movie Review:

<strong>GST(గాడ్ సైతాన్ టెక్నాలజీ)&nbsp;</strong> తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం GST(గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు హీరోలు గా, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, వాణి హీరోయిన్ లు గా నటించారు, ఈ సినిమా వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకులు ముందుకి వచ్చింది సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి. &nbsp; <strong>కధ..</strong> అప్పుడే కాలేజీ చదువులు కంప్లీట్ చేసుకున్న యువత లాంగ్ టూర్ కి వెళ్తారు, అదే మార్గం లో నేవి ఉద్యోగం చేస్తున్న అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అతనికి డబ్బు బాగా ఎలాగైనా సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని వుంటది,ప్రేమికులు ఇద్దరు సముద్రపు వడ్డున ఏకాంతంగా గడుపుతున్న సమయం లో అక్కడ చేపలు పడుతున్న జాలర్లు కి సముద్రం లో తిమింగలం స్పర్మ్ నుంచి విడుదల అయినా అతి విలువైందిది దొరుకుతుంది, ఆ వస్తువు మనం బయట వాడే పెర్ఫ్యూమ్ ల లో వాడతారు, అది చూసిన నేవి వ్యక్తి వాళ్ళని హతమార్చి తీసుకువెళ్దాం అని చూస్తాడు చివరికి ఆ విలువైన వస్తువు వాళ్ళకి దొరికిందా మధ్యలో దెయ్యం ఎందుకు ఎంటర్ అయ్యింది, ఈ కాలేజీ యువతకి ఏమిటి సంబంధం, దేవుడు గొప్పవాడా, దెయ్యం గొప్పదా, టెక్నాలజీ గొప్పదా (Gst) తెలుసుకోవాలి అంటే సినిమా థియేటర్స్ కి వెళ్లి చూడవలసిందే. &nbsp; <strong>నటి నటుల పెర్ఫార్మన్స్..</strong> కాలేజీ చదువులు కంప్లీట్ చేసుకున్న యువతగా యాక్ట్ చేసిన నటి నటులు అంత కొత్త వాళ్ళు అయినా ఫస్ట్ హాఫ్ అంత చాలా ఆహ్లాదకరంగా సినిమాని వాళ్ళ భుజాలు మీద సినిమాని నడిపించారు అని చెప్పవచ్చు, ఇక పోతే నేవీ ఆఫీసర్ గా అతని లవర్ వాళ్ళ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పాలి, నేవి ఆఫీసర్ ఆ అమ్మాయిని అంతలా ప్రేమించి ఒక్కసారే డబ్బు సంపాదించాలి అనే అత్యాశ తో ఆ అమ్మాయిని వ్యతిరేకించే విధానాన్ని బాగా పండించాడు, దయ్యం క్యారెక్టర్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి, టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో దేవుడు, దెయ్యం, టెక్నాలజీ మీద వచ్చిన ఇలాంటి కథ మన తెలుగు ప్రేక్షకులకు కొత్తది అని చెప్పాలి. &nbsp; <strong>సాంకేతికనిపుణుల పనితీరు..</strong> డైరెక్టర్ జానకి రామ్ ఈ సినిమా తీయటానికి స్మశానం లో ఆయన చేసిన రీసెర్చ్ కానీ,అన్ని మతాల దేవాలయాలలో దేవుళ్ల గురించి ఆయన చేసిన రీసెర్చ్ గానీ,సైన్స్ గురించి ఆయన ఒక సైంటిస్టులా చేసిన రీసెర్చ్ గాని.. ఈ మూడింటిని కలిపి అద్భుతమైన పాయింట్ ని తీసుకొని సినిమాని తెరకెక్కించారు అని మనకి సినిమా చూస్తుంటె తెలిసిపోతుంది. డైరెక్టర్ జానకి రామ్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ లాగా కాకుండా చాలా అనుభవం వున్నా డైరెక్టర్ లాగా ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రశంసనియం. డి. ఓ.పి&nbsp; డి.యాదగిరి సినిమాటోగ్రఫీ చాలా బావుంది, సినిమా విజువల్ వండర్ ట్రీట్ లా వుంది. మ్యూజిక్ డైరెక్టర్ యు.వి నిరంజన్ అందించిన సంగీతం సినిమా కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ప్రొడ్యూసర్ కోమరి జానయ్యనాయుడు ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు అని మనకి సినిమా చూస్తుంటె అర్ధమవుతుంది. తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్&nbsp; ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి, కధ నే హీరో గా నమ్మి వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించిన తీరు హర్షించ దగ్గ విషయం. ADVT
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs