Advertisement
Google Ads BL

ఏనుగు ఫస్ట్ లుక్


అరుణ్ విజయ్, హరి, డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్‌ ఏనుగు ఫస్ట్ లుక్ విడుదల.

Advertisement
CJ Advs

మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు హరి. తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో హరి సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. సింగం సిరీస్‌లతో దర్శకుడు హరి వరుసగా బ్లాక్ బస్టర్‌లను కొట్టేశారు. అలాంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లు తీయగల సత్తా ఉన్న దర్శకుడు హరి మొదటిసారిగా అరుణ్ విజయ్‌తో ఓ సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో తీయబోతోన్న ఈ బైలింగ్వల్ మూవీకి ఏనుగు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

మాస్, యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్‌పై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 33 మంది సెలెబ్రిటీల ఒకేసారి ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం విశేషం. ఈ పోస్టర్‌లో వినాయకుడి విగ్రహాన్ని పట్టుకుని అరున్ విజయ్ డిఫరెంట్ లుక్కులో కనిపిస్తున్నారు. తెల్లటి దుస్తుల్లో హీరో మెరిసిపోతోన్నారు. ఆ లుక్కు చూస్తుంటే కట్టలు తెంచుకునే ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఆ మీసం కట్టు పౌరుషానికి ప్రతీకలా  కనిపిస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ఈ పండుగకు సరైన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ప్రస్తుతం ఏనుగు షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, యోగిబాబు, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, రాజేశ్, కేజీయఫ్ రామచంద్రరాజు, అమ్ము అభిరామి, బోస్ వెంకట్, సంజీవ్, తలైవాసల్ విజయ్, ఇమాన్ అన్నాచి, ఆడుకలమ్ జయాబాలన్, గంగై అమరణ్, ఐశ్వర్య రమా త‌దిత‌రులు నటిస్తున్నారు.

ఈ  చిత్రానికి సాంకేతికంగానూ బలమైన టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఆంథోని ఎడిట‌ర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీన‌టులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, యోగిబాబు, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, రాజేశ్, కేజీయఫ్ రామచంద్రరాజు, అమ్ము అభిరామి, బోస్ వెంకట్, సంజీవ్, తలైవాసల్ విజయ్, ఇమాన్ అన్నాచి, ఆడుకలమ్ జయాబాలన్, గంగై అమరణ్, ఐశ్వర్య రమా త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: హరి, ప్రొడ్యూస‌ర్‌: వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్, బ్యాన‌ర్‌: డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, సీఈవో: జీ అరుణ్ కుమార్, మ్యూజిక్‌: జీవీ ప్రకాష్ కుమార్, సినిమాటోగ్ర‌ఫీ: గోపీనాథ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ఎంఎస్ మురుగరాజ్, చిన్న ఆర్ రాజేంద్రన్,ఎడిట‌ర్‌: ఆంథోని, లిరిక్స్: స్నేహన్, పి.ఆర్‌.ఓ: వంశీ - శేఖర్‌.

Enugu First Look Out:

<span>Arun Vijay, Hari, Drumsticks Productions Enugu First Look Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs