Advertisement
Google Ads BL

మ్యూజిక్ పనుల్లో ఎం.ఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్.


బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో బిజీగా మెగా మేకర్ ఎం.ఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్.

Advertisement
CJ Advs

సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా ప్రతిభగల ఎంతో మంది కొత్త నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు ఎం.ఎస్.రాజు గారు. ఇప్పుడు దర్శకుడిగా మారినా ఆయన అదే పంథాలో తన 7 డేస్ 6 నైట్స్ ద్వారా మరింత మంది కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ కి సంగీతం చాలా ట్రెండీగా ఉండాలన్న ఉద్దేశంతో, 16 ఏళ్ళ యువ సంగీత కెరటం సమర్థ్ గొల్లపూడి ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే, తన మీద ఉంచిన నమ్మకాన్ని  ప్రతిభావంతుడైన సమర్థ్ పూర్తిగా నిలబెట్టుకుంటున్నాడని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో నిమగ్నమై ఉన్న ఎం.ఎస్.రాజు అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. నా ప్రతి చిత్రానికి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్స్ లో నేను ముఖ్యంగా చూసేది ప్రతిభ మాత్రమే. అలాంటి ఆలోచన తోనే ఎంతో మంది కొత్తవారిని చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తూనే ఉన్నాం. మా 7 డేస్ 6 నైట్స్ కి వైవిధ్యమైన ట్రెండీ మ్యూజిక్ అవసరమవడం, 16 ఏళ్ళ సమర్థ్ గొల్లపూడి సంగీతం మాకు చాలా నచ్చడం, కథకి కూడా అలాంటి ఫ్రెష్ ట్యూన్స్ కావాలనిపించి అతన్ని తీసుకోడం జరిగింది. మా సినిమాని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సమర్పించడం, వైల్డ్ హానీ ప్రొడక్షన్స్ - వింటేజ్ పిక్చర్స్ - ఎ.బి.జి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ పూర్తయిన మా చిత్రం అద్భుతంగా వచ్చింది, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం అని అన్నారు.

హీరో/నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. మా 7 డేస్ 6 నైట్స్ కి కొత్త తరహా ట్రెండీ మ్యూజిక్ అవసరమవడంతో, చిన్న వయసు వాడైనా అద్భుతమైన ప్రతిభ గల సమర్థ్ ని సంగీత దర్శకుడిగా గా ఎంచుకున్నారు. ఈ 16 ఏళ్ళ పిడుగు ఆయన అనుకున్నదానికి మించి ప్రతిభని చూపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న ఎం.ఎస్.రాజు గారు నా పాత్ర చాలా బాగా రాసారు, అందుకే చాలా ఇష్టంతో చేసాను. హీరోయిన్ మెహెర్ చాహల్, రోహన్  & కృతిక శెట్టి వాళ్ళ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అన్నారు.

కో-ప్రొడ్యూసర్ జె. శ్రీనివాస రాజు మాట్లాడుతూ.. మా 7 డేస్ 6 నైట్స్ భావోద్వేగాలతో కూడిన ఒక న్యూ ఏజ్ ఫిలిం. ఇందులోని విజువల్స్, సీన్స్, లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి. మెగా ఫిలిం మేకర్ మా ఎం.ఎస్.రాజు గారు కథాంశాన్ని చాలా సున్నితంగా, ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. రీ-రికార్డింగ్ పనులు పూర్తి చేసుకుని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, స్టిల్స్: ఎం. రిషితా దేవి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, నిర్మాణ సంస్థలు: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్, సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

7 Days 6 Nights busy with background music work.:

7 Days 6 Nights busy with background music work.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs