మోస్ట్ అవెయిటెడ్ సూపర్ హీరో మూవీలో కథానాయకుడిగా టోవినో థామస్
అతీంద్రియ శక్తులను ఉపయోగించి దుష్టశక్తుల నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేది సూపర్ హీరోలు. అలాంటి సూపర్ హీరోలను ఎవరు ఇష్టపడరు? అందరూ ఇష్టపడతారు. మిన్నల్ మురళి.. ఈ ఏడాది అందరిలో అమితాసక్తిని పెంచిన మలయాళ చిత్రమిది. త్వరలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్‌పై సోఫియా పాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అప్‌కమింగ్ మలయాళ స్టార్ టోవినో థామస్ ఇందులో మిన్నల్ మురళి అనే సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఇందులో సాధారణ వ్యక్తి అయిన మురళి అనుకోకుండా ఓ పెద్ద లైటింగ్‌లో చిక్కుకుంటాడు. దాని కారణంగా అతనికి కొన్ని ప్రత్యేక శక్తులు వచ్చి అతను సూపర్ హీరో మిన్నల్ మురళిగా ఎలా మారాడనేదే కథ. ఇందులో గురు సోమ సుందరం, హరిశ్రీ అశోకన్, అంజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఫేవరెట్ సూపర్ హీరోను కలుసుకునే అవకాశాన్ని నెట్‌ఫ్లిక్స్ అందరికీ కలిగిస్తుది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను అనువాద విడుదలవుతుంది.
ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు బేసిల్ జోసెఫ్ ఈ సినిమాకు సంబంధించి ఎగ్జయింట్‌మెంట్ షేర్ చేసుకుంటూ ప్రజలు ఎమోషనల్ లెవల్లో ఓన్ చేసుకునేలా ఓ సూపర్‌హీరోని క్రియేట్ చేయాలనుకున్నాం. మామూలుగా ఏ సూపర్‌హీరో సినిమా సారాంశం అయినా యాక్షనే అయి ఉంటుంది. కానీ ఆ యాక్షన్‌కి లీడ్ చేసే కారణాలను జెన్యూన్‌గా ఫోకస్ చేయాలని, స్ట్రాంగ్ నెరేషన్ ఇవ్వాలని, తద్వారా క్రియేట్ అయ్యే యాక్షన్‌ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలని అనుకున్నాం. ఈ సినిమా చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం. మా టీమ్ అందరికీ ఇది డీమ్ ప్రాజెక్ట్ లాంటిది. నెట్‌ఫ్లిక్స్ లో మా సినిమా విడుదల కావడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం అని అన్నారు.
వీకెండ్ బ్లాక్‌బస్టర్ అధినేత సోఫియా పాల్ మాట్లాడుతూ.. ఇలాంటి డిఫరెంట్ సినిమాను చేయడమనేది నిర్మాతగా నాకు గొప్ప సవాలుగా అనిపించింది. ఈ సినీ ప్రయాణాన్ని చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఓ లోకల్ సూపర్ హీరో మిన్నల్ మురళిని క్రియేట్ చేయడానికి బెస్ట్ యాక్టర్స్, టెక్నీషియన్స్‌ను ఓ చోటకు చేర్చాం. ఈ సినిమా భాషా పరమైన హద్దులను అధిగమిస్తుంది. అందుకు కారణంగా మనలోని ఎమోషన్స్, పరిస్థితులు. మిన్నల్ మురళి చిత్ర నిర్మాతగా గర్వపడుతున్నాను. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. మేం మా ప్రయాణాన్ని ప్రారంభించాం అన్నారు.
టోనినో థామస్ మాట్లాడుతూ.. మిన్నల్ మురళి అనే సూపర్ హీరో కథ వినగానే కనెక్ట్ అయ్యాను. కమిట్‌మెంట్‌తో వర్క్ చేశాను. నేను నటుడిగా నా బెస్ట్ పెర్ఫామెన్స్‌ను ఇవ్వడానికి నా దర్శకులతో పూర్తిగా సహకరించాను. వారితో ఎప్పుడు పాత్ర గురించి మాట్లాడుతుండేవాడిని. ఎంటైర్ టీమ్ ఈ మిన్నల్ మురళి అనే సూపర్ హీరోను క్రియేట్ చేయడానికి ఎంతగానో కష్టపడింది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్ ద్వారా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన ఆడియెన్స్‌కు మిన్నల్ మురళి నా కంటే బాగా నచ్చుతాడని అనుకుంటున్నాను అన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఫిల్మ్స్ అండ్ లైసెన్సింగ్ డైరెక్టర్ ప్రతీక్షా రావు మాట్లాడుతూ.. మిన్నల్ మురళి అనే మలయాళ చిత్రం విలక్షణమైన కథనంతో, అద్భుతమైన మేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇలాంటి వైవిధ్యభరితమైన మలయాళ కథలతో మా మూవీస్ పరిధిని పెంచుకుంటున్నాం. ఈ క్రమంలో మిన్నల్ మురళి అనే సూపర్ హీరో సినిమాను మా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు అందించడమనేది చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మా లోకల్ సూపర్ హీరోగా నటించిన టోవినో థామస్ ప్రతి ఒక ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడనడంలో సందేహం లేదు అన్నారు.
నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. 190 దేశాల్లో 209 మిలియన్స్ పెయిడ్ మెంబర్ షిప్‌తో పలు రకాలైన జోనర్స్, భాషల్లో టీవీ సిరీస్‌లు, డాక్యుమెంటరీస్, ఫీచర్ ఫిలింస్ నెంబర్ వన్ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థగా తన సేవలను అందిస్తోంది. వీక్షకులు(సబ్‌స్క్రైబర్స్) ఎక్కడ నుంచి, ఎంత వరకు అయినా, ఎలాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లో అయినా ఎంజాయ్ చేయవచ్చు. సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడటం, కావాలంటే వారు చూస్తున్న షోను కావాల్సినంత సేపు ఆపుకోవడం మళ్లీ కావాలంటే ఆపేసిన చోట నుంచే వీక్షించవచ్చు. ఇలా చేసే సమయంలో ఎలాంటి కమర్షియల్ యాడ్స్, డిస్ట్రెబన్స్ ఉండవు.
2014లో బెంగళూర్ డేస్ సినిమాతో కో ప్రొడ్యూసర్స్‌గా వీకెంట్ బ్లాక్‌బస్టర్స్ సంస్థ ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి చిత్రంతో కేరళలోనే కాదు, కేరళ బయట కూడా మేజర్ మెట్రోస్‌లోని థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. ఈ చిత్రం మలయాళంలో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాదు, దక్షిణాది చిత్రసీమలో బెంగళూర్ డేస్ కల్ట్ మూవీగా నిలిచింది. రెండో చిత్రం 2016లో విడుదలై కాడు పొక్కున్న నేరమ్. దీన్ని డా.బిజు తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడమే కాదు, అవార్డును కూడా దక్కించుకుంది. ఇక తర్వాత చిత్రం మోహన్ లాల్ హీరోగా నటించిన తిరవల్లికల్ తలిర్కింకుల్‌బోల్. డొమెస్టిక్ డ్రామాగా రూపొందింది. జిబు జాకబ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలైంది. తర్వాత 2018లో బిజూ మీనన్ నటించిన పడయోట్టమ్ విడుదలైంది. మిన్నల్ మురళి వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ మోస్ట్ ప్రెస్జీజియస్ ప్రాజెక్ట్. 2021లో పలు భాషల్లో విడుదలవుతుంది. దీని తర్వాత నవీన్ పౌలీ నటించిన బిస్మి స్పెషల్ విడుదలకానుంది.