కరాచీ బేకరి ఫార్టీ ఫిఫ్త్ అవెన్యూలో ఆహా తెలుగు వెబ్ సీరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ ట్రైలర్ విడుదల
అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా. ప్రతి తెలుగు లోగిలిలోనూ సుపరిచితమైన వినోదం పేరు ఆహా. లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ నీ, పాత్ బ్రేకింగ్ షోలనీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన మోస్ట్ ఎంగేజింగ్ ఓటీటీ ఆహా. సెప్టెంబర్ 10న రొమాంటిక్ డ్రామా ది బేకర్ అండ్ ద బ్యూటీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, విష్ణుప్రియ, సాయి శ్వేత, వెంకట్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. జొనాథన్ ఎడ్వర్డ్స్ ఈ వెబ్‌సీరీస్‌కి దర్శకత్వం వహించారు. పది ఎపిసోడ్‌లున్న వెబ్ షో ఇది. ఆరు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా కలిసి తెరకెక్కించిన షో ఇది. ట్విన్ సిటీస్‌లో బెస్ట్ బేకరీ కరాచీ బేకరీ 45త్ అవెన్యూలో కాస్ట్ అండ్ క్రూ కలిసి ది బేకర్ అండ్ ది బ్యూటీ ట్రైలర్‌ని సోమవారం ఆవిష్కరించారు. ఆరు పదుల చరిత్ర కలిగిన కరాచీ బేకరీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. సంప్రదాయ పద్ధతులకు, అధునాతన అభిరుచులకు మేలు కలయికగా భోజన ప్రియులను అలరిస్తూనే ఉంది కరాచీ బేకరీ విజయ్ ఓ చిన్న బేకరీ నడుపుతుంటాడు. ఐరా వాసిరెడ్డి ప్రామినెంట్ ఫిల్మ్ స్టార్. వాళ్లిద్దరి జీవితాలకు అద్దం పడుతూ ట్రైలర్‌ను కట్ చేశారు. ఏమాత్రం పొంతన లేని రెండు బ్యాక్‌గ్రౌండ్లకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ, వారి మధ్యలో గర్ల్ ఫ్రెండ్ మహి.. ఇదంతా ఆసక్తికరంగా సాగుతుంటుంది. వారి మధ్య విరిసే నవ్వులు, రొమాన్స్, బాధలు, ఓదార్పులు.. ఒకటేంటి? అన్ని కలిపి మంచి ఎమోషనల్ డ్రైవ్‌గా ఉంటుంది. సాయి శ్వేత, సంగీత్ శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఝాన్సీ లక్ష్మి, వెంకట్... ఇలా యంగ్, ఎక్స్ పీరియన్స్డ్ ఆర్టిస్టుల మేలుకలయికగా ఈ షో మెప్పిస్తుంది.
కెషత్ ఇంటర్నేషనల్ ప్రపంచ ప్రఖ్యాత వెబ్ సీరీస్ ది బేకర్ అండ్ ద బ్యూటీని స్ఫూర్తిగా తీసుకుని అదే పేరుతో తెలుగులో రూపొందించారు. అంతర్జాతీయంగా ది బేకర్ అండ్ ది బ్యూటీ ఫస్ట్ సీరీస్‌కి మంచి స్పందన వచ్చింది. తెలుగు నేటివిటీని దృష్టిలో పెట్టుకుని ఆ షోకి చిన్న చిన్న మార్పులు చేశారు. మధ్య తరగతి తెలుగు కుటుంబాల్లో ఉండే కష్టసుఖాలు, కోరికలు, వాటి కోసం పడే తాపత్రయాలను ఈ షోలో చూడొచ్చు. పక్కా లోకల్ అబ్బాయికి, అతిలోక సుందరికి మధ్య జరిగే ప్రేమాయణం పలు రకాల భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుంది.
ఆహా గొప్ప ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గా దినదినాభివృద్ధి చెందుతోంది. దాదాపు 11 మిలియన్ల యాప్ డౌన్‌లోడ్స్ జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 45 మిలియన్ల మంది ఆడియన్స్ ఉన్నారు ఆహాకి. మొదలుపెట్టిన రెండేళ్లలోనే టాప్ క్లాస్ కంటెంట్‌ను డిజిటల్ ఆడియన్స్ కి అందుబాటులోకి తెచ్చింది ఆహా. సినిమాలు, ఒరిజినల్స్, షోస్... ద్వారా అత్యుత్తమ వినోదాన్ని తెలుగులో అందించాలన్న ధ్యేయంతో కృషి చేస్తోంది ఆహా. ఇటీవల విడుదలైన కుడి ఎడమైతే, తరగతి గది దాటి అందుకు గొప్ప ఉదాహరణలు. ది బేకర్ అండ్ ది బ్యూటీ కూడా ఆడియన్స్ ని స్పెల్ బౌండ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. భవిష్యత్తులో ఇంకా అత్యుత్తమ స్థాయిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని మై హోమ్ గ్రూప్ డైరక్టర్ మేఘన జూపల్లి తెలిపారు.
ది బేకర్ అండ్ ది బ్యూటీ లాంటి షోలో నటించడం ఆనందంగా ఉంది. వెబ్ షో కోసం ఆహాతో అసోసియేట్ కావడం గర్వంగా ఉంది. ఈ షోలో లీడ్ యాక్టర్‌గా నటిస్తున్నాను. మంచి కథను ప్రేక్షకులతో పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందులో నా పాత్ర పేరు విజయ్. ఈ షోలో విజయ్‌కున్న కన్సర్న్స్, కన్‌ఫ్యూజన్స్, సెంటిమెంట్స్ అన్నీ నాకు తెలుసు. ఇందులో రొమాన్స్ ఫిక్షనలే కావచ్చు కానీ, ఈ కథ, అందులోని పాత్రలు సమాజంలో మనకు తరచూ కనిపించేవే. ది బేకర్ అండ్ ది బ్యూటీ లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని తమ జీవితంతో పోల్చి చూసుకుంటారు. వినాయకచవితికి ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని చూడదగ్గ షో. ఈ షో ప్రీమియర్‌కి ఇంతకన్నా మంచి అవకాశం కూడా రాదు అని సంతోష్ శోభన్ తెలిపారు.
ఆహాలో ఇప్పటిదాకా మోస్ట్ పాపులర్ సినిమాలు, షోలు చాలానే రిలీజ్ అయ్యాయి. క్రాక్, లెవన్త్ అవర్, జాంబీ రెడ్డి, చావు కబురు చల్లగా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, నీడ, కాల, ఆహా బోజనంబు, ఒన్, సూపర్ డీలక్స్, చతుర్ముఖం, కుడి ఎడమైతే, తరగతి గది దాటి వంటివన్నీ ఆహా ప్రేక్షకుల మన్ననలు పొందినవే.