Advertisement
Google Ads BL

మహా సముద్రం సెకండ్ సింగిల్ చెప్పకే చెప్పకే..


మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ చెప్పకే చెప్పకే.. ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న

Advertisement
CJ Advs

సిద్దార్థ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతోన్న మహా సముద్రం సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీదున్నాయి. దసరా కానుక‌గా  అక్టోబర్ 14న ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతోంది. ఆర్ ఎక్స్ 100 తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో మహా సముద్రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం నుండి విడుద‌లైన‌ మాస్ సాంగ్ హే రంభ పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. . ఇక తాజాగా రెండో పాట చెప్పకే.. చెప్పకే.. ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విడుదల చేశారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట అదితి రావు హైదరి మీద చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ ఈ లిరికల్ వీడియోలో సిద్దార్థ్, శర్వానంద్, అను ఇమాన్యుయెల్ కూడా కనిపిస్తున్నారు.

త‌మ పక్కింటి కుర్రాడైన శర్వానంద్‌ను అదితి రావ్ హైదరి ఎంత‌గానో  ప్రేమిస్తుంది. సీక్రెట్‌గా ఆమె శర్వానంద్‌ను ఫాలో అవుతూ.. ఓ ఊహా ప్రపంచంలో బ్ర‌తికేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అను ఇమాన్యుయేల్ శర్వానంద్ జీవితంలోకి వస్తుంది. దాంతో అదితి సిద్దార్థ్‌కు సన్నిహితంగా మారుతుంది. ఈ పాటకు చైతన్య ప్రసాద్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దీప్తి పార్థసారథి గాత్రం వినసొంపుగా ఉంది. ఇది కచ్చితంగా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయే పాట అవుతుంది. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 14న మ‌హా స‌ముద్రం విడుద‌ల‌వుతుంది.

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి, ప్రొడ్యూస‌ర్‌: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం, కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌, బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్‌: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: కొల్లా అవినాశ్‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌, యాక్ష‌న్‌: వెంక‌ట్‌, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖర్‌.

Second Single Cheppake Cheppake From Maha Samudram:

<span>Rashmika Mandanna Launched Second Single Cheppake Cheppake From Maha Samudram</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs