Advertisement
Google Ads BL

డిజె టిల్లు టీజర్ విడుదల


సిద్దు జొన్నలగడ్డ, సితార ఎంటర్టైన్ మెంట్స్ చిత్రం డిజె టిల్లు టీజర్ విడుదల

Advertisement
CJ Advs

రెడీ ఆ రా..

రెడీ అన్నా 

ద సూస్కో

కళ్ళు తెరవాలన

ద తెరువు తెరువు తెరువు

ఎట్లా వచ్చిన అట్లాగే ఉన్నా గదర నేను.. ఈడనే ఉన్నది కదర బై మహేష్ బాబు బొమ్మ..రోజూ చూస్తావు కదరా..

ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే  ఎట్లైతది అన్నా..

అరేయ్ నాకు ఉన్న ఫాలోయింగ్ కి బబ్లు అన్న నన్ను యూత్ లీడర్ కింద కాంటెస్ట్ చేయమంటే అయి అన్ని, పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సంట్రేషన్ చేసిన..నా డెడికేషన్ అట్లు ఉంటది మమ్మీ నాతోని..

ఏ క్లబ్ లో ప్లే చేస్తావు నువ్వు

చల్ ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చెయ్యను నేను స్టుపిడ్ ఫెలోస్ వీళ్ళు మనం అంతా మాంకాకలమ్మ జాతర, బోనాల పండగ, సారి ఫంక్షన్, స్క్రాచ్ ఉంటది మొత్తం

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఉన్నది 

నా లైఫ్ తెలుసా నీకు

ఆ గునపం తీస్కు రా

గుణ వాట్

దట్ లాంగ్ ఇరన్ రాడ్ దట్ యు హావ్ పుట్ ఇన్ మై యాస్ ప్లీజ్ గెట్ ఇట్..

డిజె టిల్లు టీజర్ లో వినిపించే సంభాషణలు ఇవి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా 

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 

డిజె టిల్లు. ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదల అయింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే.. ఏ చిత్రం అయినా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించ టానికి టీజర్ అనేది ఓ మొదటి మెట్టు లాంటిది. ఇప్పుడు విడుదల అయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు టీజర్ కూడా అలాంటిదే. పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకునేలా సాగుతుంది. ఇందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ  ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి.

విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.

రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, మాటలు: సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం: విమల్ కృష్ణ.

DJ Tillu Teaser Out Now:

DJ TILLU - A Whacky Teaser Released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs