Advertisement
Google Ads BL

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్


బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కొత్త సినిమా టైటిల్ మిస్టర్ ప్రెగ్నెంట్

Advertisement
CJ Advs

బిగ్ బాస్ ఫేమ్, యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ కొత్త సినిమాకు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆదివారం ఈ టైటిల్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు.

మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిల్ ఆసక్తికరంగా, కొత్తగా అనిపిస్తోంది. టైటిల్ రోల్‌లో సోహైల్ సందడి చేయబోతున్నారు. కథా కథనాల పరంగా చూస్తే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది.

హీరో సోహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. అతని పాత్ర, కథాంశం విభిన్నంగా ఉంటాయి. పిల్లలకూ, పెద్దలకూ నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి. ఈ చిత్రంలో సోహెల్ సరసన రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: సయ్యద్ సొహైల్ రియాన్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవిరెడ్డి సజ్జల, దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి.

Bigg Boss Fame Sohail New Movie Title Mr. Pregnant:

Bigg Boss Fame Sohail New Movie Title Mr. Pregnant
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs