Advertisement
Google Ads BL

నా పాత్ర చాలా కీల‌కం -రుహానీ శ‌ర్మ‌


101 జిల్లాల అంద‌గాడు లో నా పాత్ర చాలా కీల‌కం -రుహానీ శ‌ర్మ‌

Advertisement
CJ Advs

అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 101 జిల్లాల అంద‌గాడు. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈ ఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రుహానీ శ‌ర్మ ఇంట‌ర్వ్యూ విశేషాలు..

- చి.ల‌.సౌ సాధించిన స‌క్సెస్‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు ద‌క్కింది. అప్పుడు 101 జిల్లాల అంద‌గాడు, హిట్ సినిమాల‌తో పాటు మ‌రో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాను. వాటిలో హిట్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు 101 జిల్లాల అంద‌గాడు విడుద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. 

- అవ‌స‌రాల శ్రీనివాస్ నటుడిగా, డైరెక్ట‌ర్‌గానే కాదు, మంచి రైట‌ర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు క‌లిసి ప‌నిచేయ‌క ముందే కొన్నిసార్లు క‌లిసి మాట్లాడాను. ఆ క్ర‌మంలో ఈ సినిమా క‌థ‌ను ఆయ‌న నాకు నెరేట్ చేశారు. నా క్యారెక్ట‌ర్‌తో పాటు, అవ‌స‌రాల క్యారెక్ట‌ర్‌తోనూ బాగా క‌నెక్ట్ అయ్యాను. 

- నాకు తెలిసి అంద‌మంటే మ‌నం అంత‌ర్గ‌తంగా ఎలా ఉంటామో అదే. మ‌నం చూడటానికి ఎంత గొప్ప‌గా ఉన్నామ‌ని అది అందం కాద‌నేది నా అభిప్రాయం. మ‌న‌ల్ని మ‌నంగా ఒప్పుకునే త‌త్వ‌మే అందం. 

- బ‌ట్ట‌త‌ల ఉండే ఓ యువ‌కుడు, అలా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌డు. అయితే దాని వ‌ల్ల అత‌నెలాంటి ప‌నులు చేశాడు. చివ‌ర‌కు అత‌నికి ఏం తెలిసింది. త‌న‌ను తాను ఎలా ప్రేమించుకున్నాడ‌నేదే క‌థ‌. 

- సినిమాను తెర‌కెక్కించే సంద‌ర్భంలో డైరెక్ట‌ర్ రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ బాగా చ‌ర్చించుకునేవారు. ఏది బెట‌ర్‌గా ఉంటుందో దానిపై ఓ క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. 

- సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్‌, నా పాత్ర చుట్టూనే సినిమా ఎక్కువ‌గా ర‌న్ అవుతుంది. నా పాత్ర ఏంట‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌గా ఉంటుంది. హీరో జర్నీలో హీరోయిన్ పాత్ర ఏంటి? ఆమె కోసం హీరో ఎలా మారాడు? అనేది క‌థ‌. ఈ సినిమాకు నా పాత్రే ఆత్మ అనుకోవ‌చ్చు. 

- స్క్రిప్ట్, నా పాత్ర న‌చ్చితే చాలు.. స్క్రీన్ స్పేస్ గురించి ఆలోచించ‌ను. నా పాత్ర‌కు న్యాయం చేయ‌డ‌మే ఆర్టిస్ట్‌గా నా క‌ర్త‌వ్యం. న‌టిగా న‌న్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుక‌ని మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. ఏదో పాట‌లు, కొన్ని సీన్స్ లో న‌టిస్తే చాలనుకోవ‌డం లేదు. 

- తెలుగులో అనే కాదు.. ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తున్నాను. హిందీలో ఓ వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాను. క‌రోనా కార‌ణంగా ఆ ఫ్లో క‌నిపించ‌లేదు. విప‌రీత‌మైన బోల్డ్ పాత్ర‌లు చేయ‌డాన్ని కంఫ‌ర్ట్‌గా ఫీల్ కాలేను. 

- హిందీలో ఇలాంటి కాన్సెప్ట్‌తో వ‌చ్చిన బాలా..101 జిల్లాల అంద‌గాడు సినిమాల థీమ్ ఒక‌టే. నేను బాలా చూడ‌లేదు. కాబ‌ట్టి పోలిక చెప్ప‌లేను. అయితే, రెండు సినిమాలు చూసిన వాళ్లు ఈ రెండింటికీ సంబంధం లేద‌ని చెబుతున్నారు. 

- అవ‌స‌రాల శ్రీనివాస్ మంచి స్నేహితుడు. త‌న‌తో చేసిన ఈ జ‌ర్నీలో త‌ను నా ఫ్యామిలీలో ఓ స‌భ్యుడ‌య్యాడ‌నే చెప్పాలి. త‌న‌ను నా సినిమాల ప‌రంగా స‌ల‌హాలు కూడా అడిగేంత స్నేహం ఏర్ప‌డింది. మంచి కోస్టార్‌. మంచి న‌టుడు, రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌. 

- తెలుగులో నేను నాలుగు సినిమాలే చేశాను. అయినా తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. 

- ప‌ర్స‌న‌ల్‌గా సైకో థ్రిల్ల‌ర్ మూవీస్‌, ల‌వ్‌స్టోరీస్ అంటే ఇష్టం. మ‌ల‌యాళంలో డార్క్ క్యారెక్ట‌ర్ చేశాను. త‌ప్పకుండా ఆ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది. 

- మంచి స్క్రిప్ట్ వ‌స్తే భాష‌తో సంబంధం లేకుండా న‌టించ‌డానికి సిద్ధ‌మే. 

- నాని ప్రొడ‌క్ష‌న్ మీట్ క్యూట్‌లో యాక్ట్ చేశాను. అలాగే తెలుగులో మ‌రో అంథాలజీలో యాక్ట్ చేశాను. 

My role is very crucial - Ruhani Sharma:

My role is very crucial - Ruhani Sharma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs