Advertisement
Google Ads BL

లవ్ మ్యారేజ్ చేసుకుంటాను -మేఘా ఆకాష్


డియర్ మేఘ నా డ్రీమ్ మూవీ - హీరోయిన్ మేఘా ఆకాష్

Advertisement
CJ Advs

అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా డియర్ మేఘ సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన డియర్ మేఘ. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ..

-రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా డియర్ మేఘ విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో నెర్వస్ గా కూడా అనిపిస్తోంది. చాలా రోజుల క్రితం నన్ను కాంటాక్ట్ చేసేందుకు దర్శకుడు సుశాంత్ రెడ్డి చాలా రోజులు ట్రై చేశారు. చివరకు నా నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి ఇలా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉంది అని చెప్పారు. నాకు మొదట్లో భయమేసింది. ఫీమేల్ సెంట్రిక్ అంటే చాలా ప్రెజర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్ కు తప్పకుండా రిస్క్ చేయాలి, కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి అనుకున్నాను. డియర్ మేఘ కథ విన్నప్పుడు చాలా రొమాంటిక్, ఎమోషనల్, లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.

-డియర్ మేఘ సినిమాలో అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. అబ్బాయి, అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఎన్నో రకాల ప్రేమలుంటాయి. మా చిత్రంలో జెన్యూన్ లవ్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. నా లైఫ్ లోనూ లవ్ ఉంది. అయితే డియర్ మేఘ చిత్రంలో జరిగినట్లు నా జీవితంలో జరిగిందా అనేది చెప్పలేను. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి అనుకోవచ్చు.

-డియర్ మేఘ క్యారెక్టర్ కు నాకు వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయి. డియర్ మేఘ లోపల చాలా అల్లరి పిల్ల కానీ బయటకు కామ్ గా ఉంటుంది. నేనూ అంతే పర్సనల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాను కానీ అందరి మధ్య ఉన్నప్పుడు బుద్ధిగా నడుచుకుంటాను. అరుణ్ ఆదిత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. 2014 నుంచి మేమిద్దరం సినిమా ఫీల్డ్ లో ఉన్నా.. కలిసి నటించడం ఇప్పటికి కుదిరింది.

-ఈ సినిమాలోని పాటలన్నీ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనందరికీ లవ్ ఫీల్, రొమాంటిక్ ఫీల్ అంటే ఇష్టం. డియర్ మేఘలోని పాటలు ఆ ఫీల్ ను అందిస్తాయి. ఆమని ఉంటే పక్కన అనే పాట నా ఫేవరేట్ సాంగ్

-వ్యక్తులుగా మనల్ని గొప్పవాళ్లుగా మార్చేసేది ప్రేమ ఒక్కటే. తల్లిదండ్రుల ప్రేమ కొన్నాళ్లు, పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ, పిల్లల ప్రేమ..ఇలా మన లైఫ్ లోని అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని, మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి. నా దృష్టిలో ప్రేమ గొప్పది, అది నిస్వార్థమైనది.

-నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్, అప్పటికి ప్రేమంటే ఏంటో తెలియని వయసది. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.

-డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. ప్రతి ప్రేమ కథలో ఉన్నట్లే ఇందులోనూ కొంత ట్రాజెడీ ఉంటుంది. ఈ సినిమాలో పర్మార్మెన్స్ విషయంలో నా మీద  ప్రెజర్ కొంత ఎక్కువగా ఉండేది. ఎవరైనా తమకు నచ్చిన వాళ్లను కోల్పోతే జీవితంలో కుంగిపోతారు. నేనూ అలాగే ఫీల్ అవుతాయి.

-వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత అర్జున్ దాస్యన్ చాలా ఫ్రీడమ్ ఇచ్చి కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు. నేను ఒక రోజు షూటింగ్ కు రాలేకపోయినా సిట్యువేషన్ అర్థం చేసుకుని అడ్జెస్ట్ చేసేవారు. ఎప్పుడూ మాకు అందుబాటులో ఉంటూ కావాల్సింది చూసుకున్నారు. చాలా మంచి ప్రొడ్యూసర్ అవుతారు.

-నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా ప్లాన్స్ అనుకున్నాను. కానీ కొన్నాళ్లకు తెలిసిందేంటంటే ఇక్కడ మన ప్లాన్ ప్రకారం ఏదీ జరగదు. ఏది జరగాలో అది జరుగుతుంది. మొదట్లో నేను నా కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్, సినిమాల్లో నటించాను. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నాను. ఇకపైనా అలాగే కంటిన్యూ చేస్తాను.

-ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నాను. గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Actress Megha Akash interview:

Actress Megha Akash interview about Dear Megha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs