దేవుడితో సహజీవనం మూవీ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ విడుదల
సురేష్ నీలి ప్రొడక్షన్‌లో కాంట్రవర్శియల్ డైరెక్టర్ సాయిరామ్ దాసరి అందిస్తున్న మరో చిత్రం దేవుడితో సహజీవనం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మరియు గ్లింప్స్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే.. దర్శకుడు రవిబాబు పంది సినిమాను ప్రమోషన్‌లో పందిచే విడుదల చేయించినట్టు.. ఈ చిత్ర దర్శకుడు సాయిరామ్ దాసరి కూడా వినూత్నంగా కుక్క చే దేవుడితో సహజీవనం చిత్ర ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ ను విడుదల చేయించారు. ఈ చిత్రంలో హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్ లు ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. దేవుడితో సహజీవనం చిత్రంలో కుక్క (భైరవ్) ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను కుక్కచే విడుదల చేయించడం జరిగింది. ఈ చిత్రానికి సురేష్ నీలి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్టిస్టులందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలను నాకు నచ్చిన సినిమాలను ప్రేక్షకులకు అందజేయాలనేదే నా ఉద్దేశ్యం. అందుకే ఇది నా పదవ సినిమాగా మీ ముందుకు రానున్నది. ఇక నా తదుపరి చిత్రం నిర్మాత భాస్కర్‌తో కావూరి చరణ్ రాజ్ అలియాస్ కేసీఆర్ అనే చిత్రాన్ని తీయనున్నాము. అది వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది.. అని తెలిపారు
నటుడు సుమిత్ మాట్లాడుతూ.. నేను చేసిన సినిమాలన్నింటిలో ఇది బెస్ట్‌గా నిలబడుతుంది. అంతబాగా వచ్చింది ఈ సినిమా. సాయిరాం దాసరి అనుకున్నదాని కంటే బాగా తీశారు అన్నారు.
విక్రాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను టైటిల్ రోల్ అయిన దేవుడి పాత్రలో నటిస్తున్నాను.. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సాయిరామ్ దాసరికి నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు.
హీరో మరియు నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉంటుంది. అలాగే చాలా ఫన్ గా కూడా సాగుతుంది. వంశీధర్ నా స్నేహితుడు అతను కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రాజెక్ట్‌ను సక్సెస్ ఫుల్ గా తీసుకొచ్చిన దర్శకుడు సాయిరామ్ దాసరికి నా కృతఙ్ఞతలు అన్నారు. ఇంకా భాస్కర్, హైమ, సింధు, మధు, వంశీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సినిమా అనుభవాలను పంచుకున్నారు.
దేవుడితో సహజీవనం చిత్రానికి కథ- మాటలు- దర్శకత్వం: సాయిరామ్ దాసరి, నిర్మాతలు: సాయిరాం దాసరి సురేష్, వంశీధర్ రెడ్డి, మ్యూజిక్: డేవిడ్, డిఓపి: తరుణ్ కె సోను, ఎడిటర్: ప్రవీణ్, పీఆర్వో: బి. వీరబాబు.