Advertisement
Google Ads BL

మెగాస్టార్ పుట్టిన‌రోజు శ్రీదేవి శోభ‌న్‌బాబు


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రం శ్రీదేవి శోభ‌న్‌బాబు ను అనౌన్స్ చేసిన గోల్డ్‌బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్న కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభ‌న్‌బాబు అనే పేరుతో రూపొంద‌నున్న ఈ క్యూట్ ల‌వ్‌స్టోరిలో యువ క‌థానాయ‌కుడు సంతోశ్ శోభ‌న్, జానులో చిన్న‌నాటి స‌మంత పాత్ర‌లో న‌టించి గౌరి జి.కిష‌న్.. జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్  కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే.. సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ ద‌గ్గ‌ర‌గా నిలుచుకుని క‌ళ్లు మూసుకుని ప్రేమ త‌న్మ‌యత్వంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరిగా రూపొందనున్న శ్రీదేవి శోభ‌న్‌బాబు తో సుష్మిత కొణిదెల‌తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

నటీన‌టులు: సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్.

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్‌: గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, నిర్మాతలు: విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల‌.

Sridevi Shobhanbabu New Movie Annoucesment :

Sridevi Shobhanbabu announces new movie on megastar Chiranjeevi birthday   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs