Advertisement
Google Ads BL

ఓ.టి.టి వద్దు.. థియటర్ ముద్దు..


తెలుగు ఫిలిం ఛాంబర్‌లో  తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్

Advertisement
CJ Advs

శుక్ర‌వారం హైద‌రాబాద్ తెలుగు ఫిలించాంబ‌ర్‌లో తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ జ‌రిగింది. ఈ స‌మావేశంలో తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రెటరీ సునిల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్, టి ఎఫ్ సీ సీ మెంబర్ అనుపమ్ రెడ్డి, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత చదలవాడ మాట్లాడుతూ.. రామారావు నాగేశ్వరరావు ఇప్పుడు లేకపోయినా వాళ్ళ సినిమాలు అడిన థియేటర్స్ ఇప్పటికీ వున్నాయి. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య అవినాభావ సంబంధం వుంది. సినిమా అనుభూతి అనేది ఓ టి టీ కన్నా థియేటర్ లోనే బాగా వుంటుంది. నిర్మాతలకు నావిజ్ఞప్టి ఏమిటంటే ఓ టి టి లను ఎవైడ్ చేద్దాం. సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ రిలీజ్ అవుతున్నప్పుడు టక్ జగదీష్ నీ అదే రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదు అన్నారు.

సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. గ‌త నెల‌లో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ ప్రెస్‌మీట్ పెట్టిన‌ప్పుడు సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేయ‌వ‌ద్దంటూ రిక్వెస్ట్ చేశాం. అయితే ట‌క్ జ‌గ‌దీష్‌ నిర్మాత‌లు వారి సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. స‌ద‌రు నిర్మాత‌ల‌కు మేం ఫోన్ చేస్తే ఆయ‌న ఆర్థిక ఇబ్బందులు గురించి చెప్పారు. దీని గురించి ఓ క‌మిటీ వేసి మాట్లాడుతామ‌ని అనుకున్నాం. అయితే మేం ల‌వ్‌స్టోరి సినిమాను సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశాం. కానీ అదే రోజున వాళ్లు ట‌క్‌జ‌గ‌దీష్ సినిమాను అమెజాన్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. నేను సినిమా రిలీజ్ చేసుకుంటాను. నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. అయితే భ‌విష్య‌త్తులో ఇలాగే కొన‌సాగ‌లేం. ఎగ్జిబిట‌ర్ అనేవాడు డిస్ట్రిబ్యూట‌ర్‌కు డ‌బ్బులు క‌ట్ట‌లేడు. అలాగే డిస్ట్రిబ్యూట‌ర్ అనేవాడు ప్రొడ్యూస‌ర్‌కు డ‌బ్బులు క‌ట్ట‌లేడు. చివ‌ర‌కు నిర్మాత‌ల‌కే డ‌బ్బులు రావు. నిర్మాత‌ల‌కు డ‌బ్బులు రావు. నిర్మాత‌ల‌కు అర్థం కావ‌డం లేదు. నిర్మాత‌ల‌కు.. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు మ‌ధ్య రిలేష‌న్ అనేది భార్యాభ‌ర్త‌ల సంబందంలాంటిది. కాబ‌ట్టి మేం నిర్మాత‌ల‌ను స‌పోర్ట్ చేయ‌మ‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేం ఓటీటీ ఛానెల్స్‌కు వ్య‌తిరేకం కాదు. వారి బిజినెస్ వారిది. పండుగ‌ల‌కు సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేయ‌కండి. ల‌వ్‌స్టోరి సినిమాను సాఫీగా విడుద‌ల‌య్యేలా చూడండి అన్నారు.

శ్రీధర్ మాట్లాడుతూ.. నా సినిమా థియేటర్లో రిలీజ్ చేయడమే నాకు ఇష్టం అన్న నాని ఇప్పుడు నిర్మాతల ఇష్టం అంటున్నారు. థియేటర్స్ బాగుంటేనే నిర్మాతలు బాగుంటారు. ఇలాగే వుంటే ఓటీటీ వైపు వెళ్ళే నిర్మాతలకు తగిన సమాధానం చెపుతాను. హీరోయిజం అంటే థియేటర్ లోనే కనపడుతుందిఓటీటీలో కనపడదు అన్నారు.  

బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ.. బాహుబలి లాంటి మూవీ ఓటీటీలో రిలీజ్ అయితే ఇంత పేరు వచ్చేదా ఓటీటీ టాలీవుడ్ కి చాలా నష్టం. మేము నిర్మాతలకు అక్టోబర్ వరకు ఆగమని చెప్పాము. వాళ్లు ఓటీటీలో కాకుండా సినిమాల‌ను థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలి అన్నారు.

Telangana Theaters Owners Association Press Meet:

Telangana Theaters Owners Association Press Meet 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs