Advertisement
Google Ads BL

బండ్ల గణేష్ హీరోనే అంట!


హీరోగా బండ్ల గణేష్.. త్వరలో వెంకట్ చంద్ర దర్శకత్వంలో సినిమా ప్రారంభం.

Advertisement
CJ Advs

నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా మారుతున్నారు. ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.‌ వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ.. బండ్ల గణేష్ అయితేనే హీరో పాత్రకు న్యాయం చేయగలుగుతారని సంప్రదించాం.‌ ఆయన ఓకే చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా ఒత్తు సెరుప్పు సైజ్ 7కి‌ రీమేక్ ఇది. పార్తిబన్ గారికి జాతీయ పురస్కారంతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి.‌ సెప్టెంబర్ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని ఛాయాగ్రహకులు. గాంధీ కళా దర్శకులు.

ఒత్తు సెరుప్పు సైజ్ 7ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

Bandla Ganesh as a hero:

<span>Film to go on the floors soon under Venkat Chandra direction</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs