Advertisement
Google Ads BL

దియా (Life is Full of Surprises) ప్రి రిలీజ్


ఘనంగా జరిగిన దియా ప్రి రిలీజ్ ఈవెంట్

Advertisement
CJ Advs

కన్నడలో దియా పేరుతో  విడుదలై సూపర్  హిట్ సాధించిన ఈ  చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని అందించాలని అదే పేరుతో  ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్ లో  క్లాప్ బోర్డ్స్  ప్రొడక్షన్స్ , విభ  కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై  ఆర్కే నల్లం ,రవి కశ్యప్ లు  సంయుక్తంగా కలసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం దియా (Life is Full of Surprises).  ఖుషి, దీక్షిత్,పృద్వి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కె.ఎస్  దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 19 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతల అభిరుచి మేరకు చిత్ర యూనిట్ కు సేవలందించిన టెక్నీషియన్స్ లను  హీరో, హీరోయిన్స్ శాలువాలు కప్పి  సత్కరించారు.

అనంతరం కో డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. ఒక  డెస్టినీ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య  ప్రేమని ఎలా మార్చింది అనే కాన్సెప్టు తో  వస్తున్న అందమైన ప్రేమకావ్యం దియా. ఈ సినిమా కన్నడ కంటే తెలుగు అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది  అన్నారు.

చిత్ర హీరో దీక్షిత్ మాట్లాడుతూ.. 10 రోజుల క్రితం ముగ్గురు మొనగాళ్ళు ప్రి రిలీజ్ . ఇప్పుడు దియా ప్రి రిలీజ్  ఇలా బ్యాక్ టూ బ్యాక్  రెండు సినిమాలు  రావడం చాలా సంతోషంగా ఉంది. గత నాలుగు సంవత్సరాలనుండీ ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాము. దర్శక, నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి గొప్ప విజయాన్ని అందించారు వారికి మా ధన్యవాదాలు. కన్నడ ప్రేక్షకులకు నచ్చినట్లే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెల 19 న  విడుదల అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని మాటీం ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్నారు. 

హీరోయిన్ ఖుషి మాట్లాడుతూ.. ఈ  కథ డీఫ్రెంట్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది.  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని విభాగాల్లో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అన్నారు.

లిరిసిస్ట్ పూర్ణ చారి మాట్లాడుతూ.. మూడు హృదయాల సంఘర్షణను ఒక పాట రూపంలో చేయడం జరిగింది. నిర్మాతలు చాలా బాధ్యతగా తీసుకొని మంచి నటీనటులను సెలెక్ట్ చేసికొని మంచి చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ నెల 19 న విడుదల అవుతున్న మా  చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి మా టీం ను ఆశీర్వదించాలని అన్నారు.

సింగర్ నరసింహ మాట్లాడుతూ.. ఈ నగరానికి ఏమైంది , మొదలగు చాలా సినిమాలకు పాటలు పాడడం జరిగింది. మొదట ఈ పాటను పెద్ద సింగర్స్ తో పాడించాలను కొన్నారు.కానీ పూర్ణ గారు నాకు ఇన్ఫర్మ్ చేసి ఆర్.కె గారికి రిఫర్ చేయడంతో ఆర్.కె గారు నాతో నీవే..నా నీ..వేనా చిట్టి లోకమంతా నాదే మారెనా.. పాటను  పాడించారు.  ఇలాంటి మంచి చిత్రం లో పాడే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు

నటీనటులు: దీక్షిత్, ఖుషి, పృద్వి తదితరులు.

చిత్రం:- దియా (Life is Full of Surprises) సాంకేతిక నిపుణులు: ప్రెజెంట్స్:-  ఫణిశ్రీ పరుచూరి, బ్యానర్:-   క్లాప్ బోర్డ్స్  ప్రొడక్షన్స్ ,విభ  కశ్యప్ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్ :- ఆర్కే నల్లం ,రవి కశ్యప్, డైరెక్టర్:- అశోక్ కె. ఎస్, మ్యూజిక్:- బి. ఆజనీష్ లోకనాథ్, ఎడిటర్:- నవీన్ రాజ్.పి, డి.ఓ.పి:- విశాల్ విట్టల్  -  సౌరభ్ వగమేర్స్, డైలాగ్స్:- కళ్యాణ్ రాఘవ్, పబ్లిసిటీ డిజైన్స్ :- రామ్ పెద్దిటి.

CLICK HERE VEDIO: Dia movie pre Release Event

Dia movie pre Release Event :

Dia movie pre Release Event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs