Advertisement
Google Ads BL

సీఐ కేశ‌వ్ నాయుడుగా ధ‌న్‌రాజ్‌.. బుజ్జి ఇలా రా లుక్


బుజ్జి ఇలా రా లో సీఐ కేశ‌వ్ నాయుడుగా ధ‌న్‌రాజ్‌.. లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన హీరో సందీప్ కిష‌న్‌

Advertisement
CJ Advs

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ బుజ్జి ఇలా రా. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌.. సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్ ను బ‌ట్టే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కొన్ని రోజుల ముందు ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌లై చాలా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలో సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను ప్ర‌ముఖ హీరో సందీప్ కిష‌న్‌ విడుద‌ల చేశారు. ధ‌న్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ధ‌న్‌రాజ్ బ్యాక్‌డ్రాప్‌లో పోలీస్ స్టేష‌న్ క‌నిపిస్తుంది. అలాగే ధ‌న్‌రాజు సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది.

గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాకు ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ‌ర్క్ చేస్తారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికిఇ క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నందు మాట‌ల‌ను అందిస్తున్నారు.

న‌టీన‌టులు: సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: క‌థ‌, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వ‌ర రెడ్డి, సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌క‌త్వం:  గ‌రుడ‌వేగ అంజి, నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: రూపా జ‌గ‌దీశ్‌, బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, మ్యూజిక్‌: సాయి కార్తీక్‌, డైలాగ్స్‌: భాను, చందు, ఆర్ట్‌: చిన్నా, ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌, 

ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌, కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌, మేక‌ప్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌. 

Dhanraj As CI Keshava Naidu:

<span>F</span><span>irst look of </span>Bujji Ilaa Raa Introducing Dhanraj As CI Keshava Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs