Advertisement
Google Ads BL

పవన్, రానా ల కాంబినేషన్లో భీమ్లానాయక్


పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు భీమ్లానాయక్

Advertisement
CJ Advs

చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.

భీమ్లానాయక్.. టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో, స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు,రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈరోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చిత్రం పేరును, వీడియో ను అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. 

చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్. అనంతరం తన స్పందనను తెలియచేశారు. పవన్ కళ్యాణ్ గారి భీమ్లానాయక్ ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయటం చాలా ఆనందం గా ఉంది. ఆయన అభిమానిగా ఆయనను ఎలా చూడాలని అనుకుంటామో అలా ఫెరోషియస్ గా, లైవ్లీ గా ఉన్నారు ఈ వీడియో లో. నాకనిపిస్తోంది ఖచ్చితంగా ఈ చిత్రం రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. 

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లతోపాటు నిత్య మీనన్, మురళీశర్మ, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్,పమ్మి సాయి తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలు,పోరాట దృశ్యాల చిత్రీకరణ గత కొన్ని రోజులుగా  హైదరాబాద్ లో జరుగుతోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

కధా నాయికలుగా నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్, ఇతర ప్రధాన పాత్రల్లో  రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు. 

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్, ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ఇష్క్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్.టి, పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్. నిర్మాత:సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.

first glimpse of Pawan Kalyan Bheemla Nayak unveiled:

Bheemla Nayak first glimpse runs for 52 seconds unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs