Advertisement
Google Ads BL

బ్యాక్ బెంచర్స్ వెబ్ సీరీస్


స్కూల్ మెమోరీస్ ఆఫ్ బ్యాక్ బెంచర్స్. తేజ్ ఇండియా అనే యూ-ట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతూ అన్నివర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సీరీస్ వందన బండారు-సత్యదేవ్ చాడ ఇన్ఫినేటం నెట్ వర్క్ సొల్యూషన్ ఆధ్వర్యంలో రన్ అవుతోంది. 15 ఎపిసోడ్స్ కంటెంట్ తో కూడుకున్న ఈ వెబ్ సీరీస్ ఇప్పటివరకు 14 ఎపిసోడ్స్ వచ్చేశాయి. స్కూల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? 9 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు రాసి దాంట్లోంచి బయటికి వచ్చే వరకు ఎలా గడిచింది జీవితం? అనేది ప్రధానంగా సాగుతుంది. ఈ బ్యాక్ బెంచర్స్ కు రచయిత, హీరో, దర్శకుడు అయిన దొరసాయి తేజ ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన వివరాలను వివరిస్తూ.. స్కూల్ లైఫ్ లో జీరో నుంచి వంద వరకు జరిగే పరిణామాలు, అందులో ఉండే సాధక బాధకాలు అన్నీ కవర్ చేశాం. స్కూల్ మెమోరీస్ ఎలా ఉంటాయో కళ్ళకు కట్టాం. స్కూల్ మెమోరీస్ ని అద్భుతంగా చూపిన వన్ అండ్ ఓన్లీ తెలుగు వెబ్ సీరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్స్ కు 4 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. అత్యధికంగా 60 లక్షల వ్యూస్. ఇంకా వస్తూనే ఉన్నాయ్.. వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయ్. ఈ తేజ్ ఇండియా అనే యూ-ట్యూబ్ ఛానల్ కు 15 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. దీనిని 2016లో ప్రారంభించాం. ముగ్గురితో ప్రారంభమైన ఇది ఇవ్వాల ఇలా ఎదిగింది. వందన బండారు-సత్యదేవ్ చాడ ఇన్ఫినేటం నెట్ వర్క్ సొల్యూషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తే.. మేము మిగతా విషయాలన్నీ చూసుకుంటున్నాం. ఈ బ్యాక్ బెంచర్స్ లో నేను లీడ్ రోల్ చేస్తూ రచనతో పాటు, దర్శకత్వం  వహిస్తున్నాను. 

Advertisement
CJ Advs

ఫిబ్రవరి 17న ఈ బ్యాక్ బెంచర్స్ అనే వెబ్ సీరీస్ ప్రారంభమైంది. గత 5 నెలల నుంచి రెగ్యులర్ గా  తేజ్ ఇండియా అనే యూ-ట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతూ అన్నివర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరినీ విశేషంగా అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ వెబ్ సీరీస్ ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ వెబ్ సీరీస్ వ్యూస్ లో కానివ్వండి, లైక్స్ లో కానివ్వండి హయ్యెస్ట్ బిగ్గెస్ట్ సీరీస్ ఇదే కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక్క వీడియోకి మాకు 3 లక్షలు లైక్స్ ఉంటున్నాయి. అలా యావరేజ్ గా 2 లక్షలు లైక్స్ పడుతున్నాయి. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో 6 కోట్లు వ్యూస్ ఉన్నాయి. ఈ వెబ్ సీరీస్ లో నాతో పాటు వర్ష డిసౌజా హీరోయిన్ గా చేస్తోంది. 16 ఏళ్ల ఈ అమ్మాయి. 10వ తరగతి చదువుతోంది. వర్షకు ఇంస్టాగ్రామ్ లో 7 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. అలాగే నీరజ్ మంచి కామెడీ ప్లే చేశాడు. 

ఉమా మహేష్, నిశ్చల్, దిలీప్, విష్ణు, యెష్వంత్, నవీన్, వెంకట్ రెడ్డి ఇలా అందరూ 20 ఏళ్ళు దాటని వారే. యంగ్ యూ-ట్యూబ్ క్రియేటని నేను. 1.5 మిలియన్ సబ్ స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. రెండున్నర లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. బ్యాక్ బెంచర్స్ ఎపిసోడ్స్ అన్ని బాగా పాపులర్ అయ్యాయి. హైదరాబాద్ లో వాల్ పోస్టర్లు వేసిన తొలి వెబ్ సీరీస్ ఇదే కావడం విశేషం. తేజ్ ఇండియా అంటేనే టీమ్ ఎంటర్టైమెంట్ జంక్షన్. ఇన్ఫినేటం నెట్ వర్క్ సొల్యూషన్ ఆధ్వర్యంలో రన్ అవుతోంది. ఇన్ఫినేటం నెట్ వర్క్ సొల్యూషన్ ఇప్పటి వరకు సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య, బ్యాక్ బెంచర్స్, రాంలీలా, తొందరపడకు సుందర వదన లాంటి హిట్ సీరీస్ లను అందించింది. బ్యాక్ బెంచర్స్ తెలుగులో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టీమ్ అవుతున్న సీరీస్ అని పేర్కొన్నారు. ఈ బ్యాక్ బెంచర్స్ అనే వెబ్ సీరీస్ కు పోస్టర్ డిజైన్: సాగర్ ముదిరాజ్, ఎడిటర్: మధు కల్లెపల్లి, సంగీతం: సుదీప్ కుర్ణి, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: సాత్విక్ జి.రాయ్, నిర్మాత: ఇన్ఫినేటం నెట్ వర్క్ సొల్యూషన్, డి.ఓ.పి: రణధీర్, రచన, దర్శకత్వం: దొరసాయి తేజ.

Backbenchers Web Series:

Backbenchers Web Series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs