Advertisement
Google Ads BL

సురాపానం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్


అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం సురాపానం. పోస్ట్ ప్రొడక్షన్  పనులు ముగించుకున్న సురాపానం సినిమా కిక్ అండ్ ఫన్ అనే శీర్షికతో తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ తో పాటు వినోదాన్ని కూడా అందించడానికి పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమౌతుంది.

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా సురాపానం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ సినీ దర్శకులు వేణు ఉడుగుల గారి చేతుల మీదుగా  ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా సినీ దర్శకులు వేణు ఉడుగుల గారు మాట్లాడుతూ, ఈ కరోన కష్ట కాలంలో ఒక సినిమా నిర్మించి బయటకి తీసుకురావడం అనేది చాలా సంక్లిష్టమైన విషయమని, ఇలాంటి పరిస్థితుల్లో వారు తీసుకున్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చిత్ర దర్శకులు సంపత్ కుమార్, ప్రొడ్యూసర్ మధు గారి ప్రయత్నం విజయాన్ని సాధించాలని, సురాపానం ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారని, ఒక ఉన్నతమైనటువంటి కథా వస్తువుతో చిత్రీకరించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సంపత్ కుమార్, ప్రొడ్యూసర్  మధు, రాజు యాదవ్ గార్లతో పాటు శ్రీనివాస్ రాయ్, విజయ్ ఠాగూర్, రాజేంద్రప్రసాద్ చిరుత, మీసాల లక్ష్మణ్, విద్యాసాగర్, రమేష్, గిరి పోతరాజు, నవీన్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన తారాగణం: హీరో హీరోహిన్లు గా.. సంపత్ కుమార్, ప్రగ్య నయన్ నటించగా.. ప్రధాన పాత్రలలో అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు, విద్యా సాగర్, అంజి బాబు, గిరి పోతరాజు, సురభి ప్రభావతి, త్రిపుర, సుజాత దీక్షితులు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ ని భీమ్స్ సెసిరోలియో అందించగా, మాటలు రాజేంద్రప్రసాద్  చిరుత, కెమెరా ( డి. ఓ. పి ) విజయ్ ఠాగూర్, ఎడిటర్ జె. పి,  కో-డైరెక్టర్ శ్రీనివాస్ రాయ్, ఆర్ట్ భూపతి యాదగిరి, ప్రొడ్యూసర్ మధు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం సంపత్ కుమార్.

Surapanam movie first look poster:

Surapanam movie first look poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs