శర్వానంద్, సిద్ధార్థ్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న చిత్రం మహా సముద్రం నుంచి హే రంభ.. సాంగ్ రిలీజ్.
ఓ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సెన్సేషన్ క్రియేట్ చేయడమనేది అరుదుగా జరిగే విషయం. అలాంటి అరుదైన విషయాలు మహా సముద్రం సినిమా అప్‌డేట్స్ విషయంలో జరుగుతున్నాయి. అందరిలో అంచనాలు పెంచుతున్న ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రామిసింగ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన చిన్న సాంగ్ ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి తొలి సాంగ్‌గా హే రంభ.. అనే పాట ప్రోమోను చూస్తే రెగ్యులర్ మాస్ నెంబర్ కాదనిపిస్తోంది. అలాగే ఎవర్‌గ్రీన్ హీరోయిన్‌కు ఇది ట్రిబ్యూట్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది.
ఈ సాంగ్ బీట్ వింటుంటే సాధారణమైన స్పెషల్ సాంగ్‌లా కూడా అనిపించడం లేదు. స్పెషల్ లుక్‌తో డాన్సింగ్ బీట్‌ను అందించారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాటలో కనపడే, రంభ గ్లామర్ కటౌట్, బ్యానర్స్, ఫొటోలు చూస్తుంటే రంభ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆమె పుట్టినరోజు భారీ ఎత్తున సెల్రబేట్ చేసే సందర్భంగా అనిపిస్తుంది. శర్వానంద్, జగపతిబాబు ఈ ప్రోమోలో రంభపై తమ ప్రేమాభిమానాలను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇద్దరి లుక్స్ పక్కా మాస్‌గా ఉంది. వారిద్దరి డాన్స్ కూడా చాలా ఫన్‌ను క్రియేట్ చేస్తుంది.
చైతన్య భరద్వాజ్ ఈ పాటను తనదైన స్టైల్లో డిఫరెంట్‌గా పాడారు. భారీతనంతో రూపొందిన ఈ పాటను భాస్కర భట్ల రాసిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న మహా సముద్రంను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్, కొల్లా అవినాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, జగపతిబాబు, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ తదితరులు
సాంకేతిక వర్గం: రచన, దర్శకత్వం: అజయ్ భూపతి, ప్రొడ్యూసర్: సుంకర్ రామబ్రహ్మం, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, మ్యూజిక్: చైతన్య భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ప్రొడక్షన్ డిజైనర్: కొల్లా అవినాశ్, ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్, యాక్షన్: వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్