Advertisement
Google Ads BL

ఆగ‌స్ట్ 6న ఆహాలో సూప‌ర్ డీల‌క్స్‌


ఆగ‌స్ట్ 6న ఆహాలో స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి న‌టించిన సూప‌ర్ డీల‌క్స్‌.. ఆక‌ట్టుకుంటున్న ట్రైల‌ర్‌.

Advertisement
CJ Advs

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఒకే ఒక కేంద్రంగా ఉంటున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో అంద‌రూ ఎదురుచూసేలా  ఓ ఆస‌క్తిని క్రియేట్ చేసిన అంథాల‌జీ చిత్రం సూప‌ర్ డీల‌క్స్‌ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుదల చేశారు. స‌మంత అక్కినేని, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్‌, ర‌మ్య‌కృష్ణ‌, మిస్కిన్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంది ఆహా. త్యాగ‌రాజ‌న్ కుమార్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థనాల‌తో రూపొంది విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ఈ చిత్రంలో నటీన‌టులు అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. 

రీసెంట్‌గా విడుద‌లైన సూప‌ర్ డీల‌క్స్‌ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఓ పెళ్లైన జంట అనుకోకుండా జ‌రిగిన హ‌త్య‌ను దాచాల‌నుకోవ‌డం, ఓ అడ‌ల్డ్ సినిమాలో న‌టించిన మ‌హిళ.. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌నుకోవ‌డం, ఓ వ్య‌క్తి లైంగిక సంబంధ‌మైన స‌మ‌స్య‌లు, మ‌తాన్ని గొప్ప‌గా న‌మ్మే ఓ వ్య‌క్తి కొంత‌మంది యువ‌కుల జీవితాల‌ను పాడుచేయాల‌నుకోవ‌డం.. ఇలా ఈ అంథాల‌జీ వేర్వేరే క‌థ‌లను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఈ జీవితాలను కలిపి ఉంచేది ఏమిటి?  కామం, అవిశ్వాసం, లైంగికత, మతం, నేరం వంటి ఇతివృత్తాలను తెలియ‌జేసేలా సూప‌ర్ డీల‌క్స్ అనే అంథాల‌జీ భావోద్వేగాల క‌ల‌యిక‌లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. 

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో త‌ను పోషించిన పాత్ర‌కుగానూ బెస్ట్ స‌పోర్టింగ్ రోల్ కేట‌గిరిలో జాతీయ అవార్డును ద‌క్కించుకున్నారు. గాయ‌త్రి, అశ్వంత్ అశోక్ కుమార్‌, అబ్దుల్ జ‌బ్బార్‌, విజ‌య్ రామ్‌, నోబెల్ కె.జేమ్స్‌, మృణాళిని ర‌విఈ చిత్రంలో ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త్యాగ‌రాజ‌న్ కుమార్ రాజా, మిస్కిన్‌, న‌ల‌న్ కుమార‌స్వామి, నీల‌న్‌.కె శేఖ‌ర్ ఈ అంథాల‌జీని ర‌చ‌నా విభాగంలో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నాటి డిస్కో డాన్సర్ కు సెట్ చేయబడిన ఈ చిత్రం యొక్క ప్రోమోను కూడా ఆహా తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేసింది, ఇది ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా ఆకర్షించింది. 

గ‌త కొన్ని వారాలుగా ఆహాలో వ‌న్‌, నీడ‌, పొగ‌రు, హీరో, విక్ర‌మార్కుడు, విజ‌య్ సేతుప‌తి వంటి సినిమాల తెలుగు వెర్ష‌న్స్ ప్రీమియ‌ర్స్ ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. అలాగే అమ‌లాపాల్, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన.. దేశంలోనే డిజిట‌ల్ ప్ర‌ద‌ర్శిత‌మైన‌ మొట్ట మొద‌టి టైమ్ లూప్ సై ఫై థ్రిల్ల‌ర్ సిరీస్ కుడి ఎడమైతే ఒరిజిన‌ల్‌ను విడుద‌ల చేసి రీసెంట్ టైమ్స్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఆహా వార్త‌ల్లో నిలిచింది. ఈ ఏడాదిలోనే క్రాక్‌, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, మెయిల్‌ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను, షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది ఆహా.

Super Deluxe ahead of its premiere on August 6th:

<span>Super Deluxe ahead of its premiere on August 6th</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs