Advertisement
Google Ads BL

వరుడు కావలెను సాంగ్


ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్  సంగీతంలో వరుడు కావలెను నుంచి ఫోక్ గీతం విడుదల

Advertisement
CJ Advs

వరుడు కావలెను నుంచి నాగ శౌర్య , రీతువర్మ ల ఫోక్ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్

*  అబ్బుర పరిచే స్వరాలు సమకూర్చిన  ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్

*ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ ఆలపించిన మరో సుమధురమైన గీతం

*సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం వరుడు కావలెను

నేడు (4-8-2021) వరుడు కావలెను చిత్రం యూనిట్ చిత్రం లోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….

 నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో

నాపగడ్డి సేలగాడ  నాకేట్టి పనిరో... అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత అనంత శ్రీరామ్ రచించారు. ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్  వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు.. సంగీతం, సాహిత్యం, నృత్యాలు  ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా పాట బహుళ ప్రజాదరణ పొందింది. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు, వీడియోలు వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది .. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.  వరుడు కావలెను చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

Varudu Kaavalenu - Digu Digu Digu Naaga Lyric Video Out Now:

Varudu Kaavalenu - Digu Digu Digu Naaga Lyric Video Out Now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs