Advertisement
Google Ads BL

6న థియేటర్ లలో మెరిసే మెరిసే


ఘనంగా జరిగిన మెరిసే మెరిసే ప్రీ రిలీజ్ వేడుక, ఆగస్టు 6న థియేటర్ లలో మూవీ విడుదల.

Advertisement
CJ Advs

హుషారు ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా మెరిసే మెరిసే.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మెరిసే మెరిసే చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దర్శకులు సుకుమార్, వీవీ వినాయక్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. 

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ.. మెరిసే మెరిసే లో మంచి మ్యూజిక్ కుదిరింది. విజయ్ ప్రకాష్, చిన్మయి, లిప్సిక, అనురాగ్ కులకర్ణి వంటి సింగర్స్ చాలా బాగా పాడారు. కనులతో రచించు కావ్యాలలో పాట పాడేప్పుడు విజయ్ ప్రకాష్, చిన్మయి చాలా ఎంజాయ్ చేశారు. దర్శకుడు పవన్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మన వాడిలా పని చేయించుకున్నారు. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా అనిపించింది. నెక్ట్ కూడా మేము కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా. ఈ సినిమాకు పనిచేస్తుంటే, అప్పుడే అయిపోయిందా అనిపించింది. శేఖర్ కమ్ముల గారి సినిమాలా ప్లెజంట్ గా ఉంటుంది. అన్నారు.

నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ.. మా కొత్తూరి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ద్వారా పవన్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా మిగతా ఆర్టిస్ట్ లు అంతా చక్కగా నటించారు. మెరిసే మెరిసే ఆగస్టు 6న పీవీఆర్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతోంది. మా సినిమాను థియేటర్ లలో చూసి మరిన్ని మూవీస్ చేసేలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నారు.

దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ.. మెరిసే మెరిసే మూవీ యువత ఆలోచనలు, ఆశలు, కోరికల గురించి తీసిన సినిమా. 20 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండదు. అలాంటి అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు. వీళ్లు ఇద్దరు ఎలా తారసపడ్డారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అందుకున్నారు అనేదే ఈ సినిమా. వీళ్లిద్దరివీ సెన్సిబుల్ క్యారెక్టర్స్. సినిమా అంతా ఎక్కడా ఐ లవ్ యూ కూడా చెప్పుకోరు. కానీ వాళ్ల మనసులు ఒకరికొకరు అర్థమవుతుంటాయి. చిన్న సినిమాకు ఎన్నో కష్టాలుంటాయి. కానీ నిర్మాత వెంకటేష్ గారు మా వెనక బలంగా నిలబడ్డారు. సినిమా క్వాలిటీ చూసి మరింత బడ్జెట్ పుష్ చేద్దాం అని ఎంకరేజ్ చేద్దాం. దినేష్, శ్వేతా క్యారెక్టర్స్ పోటా పోటీగా ఉంటాయి, అయినా దినేష్ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. మంచి కథ ముఖ్యం అన్నాడు. వెన్నెల అనే క్యారెక్టర్ లో శ్వేతా చక్కగా నటించింది. ఈ టైమ్ లో థియేటర్లలో రిలీజ్ అవసరమా అంటే అవసరమే అని చెబుతాను. ఎందుకంటే మన టెన్షన్స్ రిలీఫ్ అయ్యేది థియేటర్ లలోనే. సో థియేటర్ లకు వచ్చి మా శ్వేతా, దినేష్ పర్మార్మెన్స్ చూస్తారని ఆశిస్తున్నా  అన్నారు.

లిరిసిస్ట్ కృష్ణవేణి మాట్లాడుతూ.. మా నాన్న సదాశివుడు గారు చాలా పాటలు రాశారు. ఆయన స్ఫూర్తితోనే నేనూ లిరిసిస్ట్ అయ్యాను. పాటలు చాలా బాగా వచ్చాయి. మెలొడియస్ గా  ఉన్నాయి. మెరిసే మెరిసే చాలా ఫ్రెష్ ఫిల్మ్. నేటి యూత్ కు బాగా నచ్చుతుంది. కొత్త రచయిత వస్తున్నారంటే కాదనకుండా ఎంకరేజ్ చేశారు నిర్మాత వెంకటేష్ గారు. వాళ్లు అవకాశం ఇవ్వకుంటే ఈ స్టేజీ మీద ఉండేదాన్ని కాదు. అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా థియేటర్ లో చూడండి అన్నారు.

నాయిక శ్వేతా అవస్థి మాట్లాడుతూ.. మెరిసే మెరిసే 6 ఆగస్టు మీ ముందుకొస్తోంది. అందరూ తప్పకుండా చూడండి. మా నిర్మాత వెంకటేష్ గారు సినిమా ప్రాసెస్ మొత్తం మాకు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ పవన్ గారితో పనిచేయడం మంచి ఎక్సీపిరియన్స్. యాక్టర్స్ అందరి నుంచి కావాల్సిన పర్మార్మెన్స్ తీసుకున్నారు. నేను సినిమా చూసినప్పుడు మ్యూజిక్ అమేజింగ్ గా అనిపించింది. నాకు తెలుగు రాదు. సీన్స్ చేసేప్పుడు దినేష్ చాలా సపోర్ట్ చేశాడు. మెరిసే మెరిసే ను మీరూ ఎంజాయ్ చేయండి అన్నారు.

హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ.. మెరిసే మెరిసే నా మూడో మూవీ. రెండు సార్లు పాండమిక్స్ వచ్చి, లాక్ డౌన్ లు ఎదురయ్యాక కూడా థియేటర్ ల ద్వారా మీ ముందుకు వస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ పవన్ నాకు దొరకడం నిజంగా అదృష్టం. అతను ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్. గుర్తుపెట్టుకోండి పవన్ టాలీవుడ్ లో మంచి హిట్ ఫిల్మ్స్ ఇస్తాడు. నిర్మాత అంటే మా వెంకటేష్ గారిలా సపోర్టివ్  గా ఉండాలి. మీరు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్వేతా స్వీట్ హార్ట్. తెలుగు ప్రేక్షకులకు శ్వేతా మరో క్రష్ అవుతుంది. ఇవాళ మంచి మనుషులు దొరకడం కష్టం. కానీ మా సినిమాకు అందరు ఒక మంచి ఇంటెన్షన్ తో పనిచేశాడు. కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతను మరిన్ని సినిమాలు చేస్తాడని చెప్పగలను. మా సినిమాను ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదు అని చాలా మంది అడిగారు. మాకు థియేటర్లంటే ప్రాణం. థియేటర్లతో మా లైఫ్ లో ఎన్నో ఎక్సీపిరియన్స్ ఉన్నాయి. ఇంట్లో బాగా లేకపోతే ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లి రిలీఫ్ అవుతాం. ఒక చిన్న సినిమా ఆదరణ పొందితే ఎంతోమంది డ్రీమ్స్ నిజం అవుతాయి. నేను సక్సెస్ అవ్వాలని స్నేహితులు చాలా మంది కోరుకోవడం నా అదృష్టం. మీరంతా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను. మెరిసే మెరిసే ఒక క్లీన్ మూవీ. ప్లెజంట్ గా ఉంటుంది. థియేటర్ లలో చూస్తారని ఆశిస్తున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, ఇతర చిత్ర బృందం పాల్గొని మెరిసే మెరిసే సినిమా విజయం సాధించాలని కోరారు.

నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాత: వెంకటేష్ కొత్తూరి. ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిట‌ర్‌:  మ‌హేశ్‌.

Merise Merise movie will be released in theaters on August 6th.:

Merise Merise&nbsp;<span>movie will be released in theaters on August 6th.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs