యంగ్ అండ్ హ్యీపెనింగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. టాలెంటెడ్ డైరెక్టర్ తిరుమల కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. మహిళల గొప్పతనాన్ని తెలియజేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి టైటిల్ బావుందంటూ ప్రశంసలు దక్కాయి.
ఈ చిత్రంలో ఎవర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శరత్‌కుమార్, ఊర్వశి భాగమయ్యారని లేటెస్ట్‌గా నిర్మాతలు తెలియజేశారు.
సినిమాలో ముగ్గురు మహిళల పాత్ర ఎంతో కీలకంగా ఉండటంతో ఆ పాత్రలను చేయడానికి చాలా అనుభవం, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవసరం కావడంతో మేకర్స్..ఖుష్బూ, రాధికా శరత్‌కుమార్, ఊర్వశిలను ఆ పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ పాత్రలను ఈ ప్రత్యేకమైన సినిమాలో ప్రత్యేకంగా మలిచారు డైరెక్టర్ తిరుమల కిషోర్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నషూటింగ్‌లో వీరు ముగ్గరు జాయిన్ అయ్యారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అదిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.