Advertisement
Google Ads BL

విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన చిత్రపటం పాట


సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం చిత్రపటం పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ  చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని నింగిని చూసి నేర్చుకున్న.. అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్లో విడుదల చేశారు.

Advertisement
CJ Advs

అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం   మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా  చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ఇంటర్నెట్ లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే. దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. పొయెటిక్ గా ఉంటూనే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి అని అన్నారు. 

నిర్మాత పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ, త్వరలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో కోట శ్రీనివాసరావు, పోసాని, నరేన్, బాహుబలి ప్రభాకర్, శరణ్య పొన్నవన్, బాలాచారి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: వినోద్, నిర్మాత: పుప్పాల శ్రీధరరావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం: బండారు దానయ్య కవి.

Chitrapatam Movie Trailer Soon:

chitrapatam movie trailer soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs