Advertisement
Google Ads BL

ప్రకాష్ రాజ్ విడుదల చేసిన భగత్ సింగ్ నగర్ టీజర్


ప్రకాష్ రాజ్  విడుదల  భగత్ సింగ్ నగర్ టీజర్

Advertisement
CJ Advs

తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా మా అసోసియేషన్ కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు భగత్ సింగ్ నగర్ చిత్ర  దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన.. నటుడు ప్రకాష్ రాజ్ గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై  విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్. తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో, దర్శకుడు వీరభద్రం, దర్శకుడు చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్, దర్శకుడు బాబ్జి, నువ్వు తోపురా నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్, యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

ముఖ్య అతిధిగా వచ్చిన  నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులు తో పని చేశాను.వీరంతా నాలోని నటనను చెక్కి దిద్ది నాలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడున్నాను. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏ.వి లో బావుంది. కానీ  నా పర్మిషన్ లేకుండా మా అసోసియేషన్ కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించడం తప్పు. సినిమాను సినిమాగానే చూద్దాం. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను.అవసరమైతే మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ ను తీసివేయమని కోరుతున్నానను. నాకు భగతసింగ్ అంటే  నాకు ఎంతో ఇష్టం. ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.భగతసింగ్ ఉంటే చెగువేరా అంతటి మనిసయ్యేవారు.చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను కాలీగా ఉన్నానే  ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను వారికి నా అవసరం ఉంటుంది అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన దేశంతో పని లేకుండా సాటి మనిషి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.ఎంతోమంది గురువులు వున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో  వస్తున్న ఇలాంటి యువకుల ఆలోచనలను, ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి కనుక మనమంతా సపోర్ట్ గా నిలిచి ఎంకరేజ్ చెయ్యాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు.

దర్శకుడు బాబ్జి  మాట్లాడుతూ.. ఇది క్రాంతి కల కాదు ఇది వారి తండ్రి మునిచంద్ర కల, ఒక తండ్రి కల,ఒక తల్లి కలను తనయులు తీరుస్తున్నారు.ఇది ఈ సినిమా గొప్పతనం మనమందరికీ పండుగలు తెలుసు ఏదైనా పండుగ వస్తే వారు భక్తికి కోసం ఉపవాసాలు ఉంటారు కొందరు ఆరోగ్య సమస్యలు బాగవ్వాలని ఉపవాసాలు ఉంటారు కొందరు. కానీ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ముందు గులాముల్లా  వంగి సలాంలు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న  బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. తను చనిపోయిన మార్చి 23వ ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది.ఇంత గొప్ప దేశభక్తి ఉన్న గ్రేట్ ఫ్యామిలీ. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఈ కుటుంబం నుండి భగత్ సింగ్ ఆలోచనలతో వచ్చిన దర్శకుడే క్రాంతి. మా ముందు పెరిగిన క్రాంతి ఇలాంటి మంచి ప్రయత్నం తో ఈ సినిమా తీశాడు అంటే మా కెంతో గర్వంగా ఉంది.మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్నాడు. ఇందులో హీరోగా వారి తమ్ముడు విదార్థ్ హీరోగా నటిస్తున్నాడు, వారి తల్లి, తండ్రులు ఈ సినిమాకు నిర్మాతలు.ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న తను ప్రజానాట్యమండలి లో నాటకాలు వేసుకొంటూ పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఏ రోజు కైనా  సినిమాలలోకి వెళ్ళాలి, సినీ పరిశ్రమలో తన జెండా ఎగరవేయాలని కల గనే మునిచంద్ర గారు కలను, నెరవేర్చుకోవడం కోసం తన తనయులుతో పాటు వారి కుటుంబమంతా కలసి చేస్తున్న సినిమానే భగత్ సింగ్ నగర్.ఒక తండ్రికి ఇంతకంటే ఇంకేమి కావాలి.వారు చేసిన ఈ ప్రయత్నాన్ని చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను. ఇలాంటి మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్న దర్శక, నిర్మాతలకు మనమంతా సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నానని అన్నారు.

భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ.. ఈ రోజు నేను లెజండరీ ప్రకాష్ రాజ్ గారితో స్టేజ్ షేర్ చేసుకొంటానాని ఊహించలేదు.బెనర్జీ గారి హెల్ప్ తో ప్రకాష్ రాజ్ సర్ ను కలసి మా ఫంక్షన్ ఇన్వైట్ చేయడం జరిగింది. మా చిత్రం టీజర్ ను ప్రకాష్ రాజ్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకులను ఇబ్బంది పెట్టకుండా సీనియర్ ఆర్టిస్ట్స్ సపోర్ట్ చేయాలని మనవి చేసుకొను చున్నాను.ఎందుకంటే మా నాన్న వెంట, నావెంట పడి సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని వెంటపడితే నేను సినిమాలో ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని  పాత్ర ఇస్తే నాకు నరకం చూయించాడు.నువ్వు చెపితే నేను వినేది ఏమని నేను చెపితే నువ్వు వినమని. క్యారెక్టర్ గా షూటింగ్ చేసే సమయంలో వన్ మోర్ అంటే చేయకుండా నాకు చుక్కలు చూపించాడు. ఇండస్ట్రీ కు వచ్చే మా లాంటి కొత్త దర్శకులను సపోర్ట్ చెయ్యాలని సినీ పెద్దలను వేడుకొంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన బెనర్జీ కు ధన్యవాదాలు,అలాగే మా టీజర్ ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము అని అన్నారు.

సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ గారి చేతుల మీదుగా నా పాటలు విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.నా టీం సపోర్ట్ తో నేను మంచి పాటలు అందించారు.నాకే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

హీరో విదార్ధ్ మాట్లాడుతూ.. మా నాన్న గారి సపోర్ట్ చేయడం వలనే నేను ఈరోజు నేనీ స్టేజ్ మీదున్నాను. దర్శకుడు మా అన్న క్రాంతి మంచి కంటెంట్ తో కొత్త కాన్సెప్ట్ ను రెడి చేసుకొని తీసిన ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.

హీరోయిన్ దృవీక మాట్లాడుతూ.. మలయాళం లో నేను నటించాను. తెలుగులో నాకిది మొదటి చిత్రం.నాకీ సినిమాలో  మంచి పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దర్శక,నిర్మాతలు చేసే గొప్ప ప్రయయత్నాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి సినిమా గొప్ప విజయం సాధించేలా చేయాలని అన్నారు

Bhagat Singh Nagar teaser released by Prakash Raj:

Bhagat Singh Nagar movie teaser released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs