Advertisement
Google Ads BL

ఫిల్మ్ క్రిటిక్స్ నూతన కార్యవర్గం ఎన్నిక


గత యాబై సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నేడు జులై 25న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగాయి. ఈ ఎన్నికల్లో  సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ని అధ్యక్షడు గా, మిగతా కార్యవర్గాన్ని  ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఒక్క కోశాధికారి పోస్ట్ కోసం హేమసుందర్, నాగభూషణం మధ్య పోటీ జరిగింది.. ఈ పోటీలో హేమసుందర్ విజయం సాధించారు.. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ రావు రిటర్నింగ్ అధికారిగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా .. 

Advertisement
CJ Advs

ఫిల్మ్ క్రిటిక్స్ నూతన అధ్యక్షుడు ప్రభు మాట్లాడుతూ..కరోన టైంలో సభ్యుల సంక్షేమం కోసం గత కమిటీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది.. అందుకు ప్రెసిడెంట్ సురేష్ కొండేటిని, సెక్రటరీ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్నాను.. అలాగే మేము నూతనంగా ఎన్నికైన  మా కమిటీ ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమం కోసం నా వంతుగా కృషి చేస్తాను.. ముఖ్యంగా ఆరోగ్య బీమా,  హెల్త్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ద్వారా వచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పాటుపడతానాని, ముఖ్యంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా గోల్డెన్ జూబిలీ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి, అసోసియేషన్ కోసం ఫండ్ రైజింగ్ చేసి మరింత అభివృద్ధి చేస్తానని.. నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. అన్నారు. 

ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభివృద్ధికి, మన సభ్యుల సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేసి..  ఎలాంటి అవాంతరాలు, అవకతవకలు  లేకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని.. అన్నారు. 

నూతన కార్యవర్గ సభ్యులు; 

అధ్యక్షుడు ఏ. ప్రభు, ఉపాధ్యక్షులు నాగేంద్ర కుమార్, మోహన్ ఓగిరాల,  ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు, ఉపకార్యదర్శులు యల్. రాంబాబు వర్మ, చిన్నముల రమేష్, కోశాధికారి హేమసుందర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ; సాయి రమేష్, అబ్దుల్, సురేష్ కవీర్యాని, ధీరజ్ అప్పాజీ, భాగ్యలక్ష్మి, టి. మల్లికార్జున్, జిల్లా సురేష్, మురళి,  వీర్ని శ్రీనివాసరావు, కుమార్ వంగాల, నవీన్ సిహెచ్ లు ఎన్నికయ్యారు.

Election of a new working group of film critics:

Election of a new working group of film critics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs