ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇష్క్ -హీరో తేజ సజ్జ
చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ఇటీవల జాంబీరెడ్డి సినిమాతో సూపర్‌హిట్ సాధించారు. ప్రస్తుతం హీరో తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం ఇష్క్. ఈ సినిమా జులై 30న విడుదలవుతున్న సందర్భంగా.. హీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్ తో వస్తోంది. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆడియన్స్‌ను ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. కెరీర్ స్టార్టింగ్ డేస్‌లోనే ఇలాంటి సినిమా నాకు రావడం చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను.
హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే సినిమా ఇది. అన్ని రకాల ఎమోషన్స్ పండించడానికి మంచి స్కోప్ దొరికింది. ఓ బేబీ, జాంబీ రెడ్డి సినిమాలతో నాకు యాక్టర్‌గా మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో నా పెర్‌ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారనే నమ్మకం ఉంది.
ఫ్రెష్ మేకింగ్ అండ్ న్యూ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉన్న మూవీ ఇది. ఇలాంటి సినిమాలకు సంగీతమే ప్రధానం. ఈ సినిమాకి పాటలతో పాటుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారి కొడుకు మహితి సాగర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రాణం. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అయినప్పటికీ ఎక్కడా గీత దాటలేదు. ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది.
ఒక మంచి కంటెంట్‌తో ఈ సినిమా తీశాం. థియేటర్స్‌లో ఎప్పడు రిలీజ్ చేసిన మా టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. వారు ఇప్పటికే 90కి పైగా చిత్రాలు నిర్మించారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడం నిజంగా సంతోషకరమైన విషయం.
ప్రియా చాలా మంచి నటి, ఈ కలెక్షన్స్, రికార్డులు ఇలాంటివేమి పట్టించుకోదు. తనపని తను చేసుకుని వెళ్లిపోతుంది. ఈ సినిమాతో తన క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. త్వరలోనే ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. మా దర్శకుడు యస్.యస్. రాజుకి మొదటిసినిమా అయినా చక్కగా తెరకెక్కించారు.
ప్రశాంత్ వర్మ నేను మంచి స్నేహితులం. మేం ఎప్పుడు కలిసిన సినిమాల గురించే మాట్లాడుకుంటాం.
నా తదుపరి చిత్రానికి ప్రశాంత్ వర్మనే దర్శకుడు. హను - మాన్ మూవీ ఇప్పటికే 15రోజులు షూటింగ్ పూర్తయ్యింది. సినిమా చాలా బాగా వస్తోంది. తెలుగులో వస్తోన్న ఫస్ట్ సూపర్‌హీరో మూవీ. ఈ సినిమాతో నా కెరీర్ స్థాయి మారుతుంది అనే నమ్మకం ఉంది.