Advertisement
Google Ads BL

సూర్య39 జై భీమ్ లుక్


త‌మిళ‌స్టార్ హీరో సూర్య ఇటీవ‌ల ఆకాశం నీ హద్దురా సినిమాతో సూప‌ర్‌స‌క్సెస్ అందుకున్నారు. జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 39వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి జై భీమ్ అనే పవర్‌ఫుల్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు.

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా రిలీజ్‌చేసిన పోస్ట‌ర్లో సూర్య లాయర్ గా క‌నిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి, తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సుర్య శివ‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర పాండియ‌న్ స‌హ నిర్మాత‌. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రాజీషా విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ప్రకాష్ రాజ్, రావు ర‌మేష్‌, మ‌ణికంద‌న్, జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు కీలకపాత్రల‌లో నటిస్తున్నారు. సేన్ రోల్డ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి  ఎస్ఆర్ క‌థీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌, పిలోమిన్ రాజ్ ఎడిట‌ర్‌.

Suriya Next - Jai Bhim First Look Released:

<span>&nbsp;Jai Bhim First Look Released</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs