Advertisement
Google Ads BL

సుహసినీకి బలమెవ్వడు


బలమెవ్వడు సినిమాలో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న సుహసినీ

Advertisement
CJ Advs

దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసినీ. తెలుగు ప్రేక్షకులకు సుహసినీ అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు సుహసినీ. గతంలో రాఖీ చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనకు తెలుసు. ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ పాత్రను బలమెవ్వడు చిత్రంలో పోషిస్తున్నారు సుహసినీ. బలమెవ్వడు సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ నటన అద్బుతంగా ఉండబోతోంది.

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న బలమెవ్వడు సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు బలమెవ్వడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన బలమెవ్వడు కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

నటీనటులు: ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ  డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్

సాంకేతిక నిపుణులు: సంగీతం - మణిశర్మ, సాహిత్యం - కళ్యాణ్ చక్రవర్తి, సినిమాటోగ్రఫీ - సంతోష్ శక్తి, గిరి.పి, ఎడిటర్- జెస్విన్ ప్రభు, ఫైట్స్ - శివరాజ్, కాస్ట్యూమ్స్ - హరీష రాచకొండ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ధృవన్ కటకం, నిర్మాత - ఆర్ బి మార్కండేయులు, రచన దర్శకత్వం - సత్య రాచకొండ.

Suhasini is playing a powerful role in the movie Balamevvadu:

Suhasini is playing a powerful role in the movie Balamevvadu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs