Advertisement
Google Ads BL

నవరస నుంచి రొమాంటిక్‌ సాంగ్‌


తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ న‌వ‌ర‌స‌. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్‌ 6న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలవుతుంది. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం.  (కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం వీటి ఆధారంగా న‌వ‌ర‌స‌ రూపొందింది. రీసెంట్‌గా విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్‌ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది. 

Advertisement
CJ Advs

సోమవారం ఈ అంథాలజీ నుంచి తూరీగ.. అనే సాంగ్‌ను విడుదల చేశారు. సూర్య, ప్రయాగ రోస్‌ మార్టిన్‌ ప్రధాన తారాగణంగా నవరసలో ప్రేమ అనే భావోద్వేగంపై రూపొందించిన గిటార్‌ కంబిమేల నిండ్రు అనే పార్ట్‌ నుంచి ఈ రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు మదన్‌ కార్కి సాహిత్యాన్ని అందించారు. దీన్ని గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించారు. 

కొవిడ్‌ కారణంగా సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతిన్నది. తమ పరిశ్రమలోని 12000 మందికి తమ వంతు సాయాన్ని అందించడానికి కోలీవుడ్‌ పరిశ్రమ ఒక్కటిగా నిలబడి చేసిన ప్రయత్నమే నవరస అంథాలజీ. ఇండస్ట్రీ టాలెంట్‌, క్రియేటివిటీకి నవరస నిదర్శనంగా నిలవనుంది. భూమిక ట్రస్ట్‌ ద్వారా మేం చేయనున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఆగస్ట్‌ 6న విడుదలవుతున్న ఈ అంథాలజీని 190 దేశాల్లో ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా  వీక్షించనున్నారు

Navarasa song launch:

Tureega song from Navarasa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs