Advertisement
Google Ads BL

నట్టి కరుణ హీరోయిన్ గా DSJ


అద్భుతమైన కాశ్మీర్ అందాలను చూపిస్తూ చిన్మయి పాడిన మేఘాలలో హరివిల్లులా పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన  DSJ(దెయ్యంతో సహజీవనం) చిత్రం టీం  

Advertisement
CJ Advs

మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే DSJ(దెయ్యంతో సహజీవనం…) అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ  లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి  నిర్మిస్తున్న చిత్రం DSJ(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్  పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో చిన్మయి పాడిన మేఘాలలో హరివిల్లులా అనే అద్భుతమైన పాటను ఈ రోజు మ్యాంగో మ్యూజిక్  ద్వారా విడుదల చేస్తున్న సందర్భంగా

 చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ… కాశ్మీర్ లోని  అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన మేఘాలలో హరివిల్లులా పాటను చిన్మయి పాడింది. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఈ నెల 16 న 5 భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నట్టి కరుణ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది.  బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.  నేను దర్శకత్వం వహించే ఈ  DSj(దెయ్యంతో సహ జీవనం) చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.కరోనాటైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం  ఉందని అన్నారు.

చిత్ర నిర్మాతలు నట్టి క్రాంతి మాట్లాడుతూ… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది.  చిత్రంలోని నటీనటులందరూ చాలబాగా నటించారు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో  సుపూర్ణ మాలకర్ నటించారు. అలాగే కోటి గారి అబ్బాయి రాజీవ్  కూడా ఇందులో నటించాడు.

కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాము. అందరూ బాగా సహకరించడం వలన సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము. త్వరల్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనున్న DSJ (దెయ్యంతో సహజీవనం) చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికి తప్పక నచ్చుతుందని అన్నారు..

Natti Karuna DJS Update :

Natti Kumar daughter Karuna DJS Update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs