Advertisement
Google Ads BL

టెర్రిఫిక్ డ్యాన్స్ తో అద‌ర‌గొట్టిన దివి


దివి వధ్య ఇటీవ‌ల ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటున్న దివి తాజాగా నివృతి వైబ్స్‌ రూపొందించిన సిలకా ముక్కు దానా అనేది తెలంగాణ ఫోక్ సాంగ్ తో మ‌రోసారి టాక్ఆఫ్‌ది టౌన్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఈ పాట‌కు ప్ర‌ముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. సింగర్ హరిక నారాయణ్ ఆలపించారు. మదీన్ ఎస్.కె దీనికి బాణీలు సమకూర్చారు. తాజాగా విడుదలైన ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటుగా అందరూ కాలు కదిపేలా ఉంది.

దివి వధ్య తన గ్లామర్, మాస్ డ్యాన్స్‌తో  సిలక ముక్కు దానా సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ఆమె హాట్ ఎక్స్ప్రెషన్స్.. ఇందులో అమ్మడి యాటిట్యూట్ మరియు డ్యాన్స్ మూమెంట్స్ అంద‌రి హృదయాలను కొల్లగొడుతున్నాయి. శేఖర్ మాస్టర్ ఈ మ్యూజిక్ వీడియోకు కొరియోగ్రఫీ చేయడంతో పాటు స్వ‌యంగా దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ కు మంత్ర శివ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉదయ్ ఎడిట‌ర్‌, రామ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. జ్యోతి కున్నూరు ఈ పాటను నిర్మించారు. దివి హాట్ అండ్ టెర్రిఫిక్ డాన్స్ నెంబర్ సిలకా ముక్కు దానా ఈ సీజన్ లో బెస్ట్ మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Divi Vadthya Terrific Dance Number Silaka Mukku Dana:

Big Boss Fame Divi Vadthya Terrific Dance Number Silaka Mukku Dana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs