Advertisement
Google Ads BL

ఎంఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్


రెగ్యులర్ షూటింగ్‌లో ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న 7 డేస్ 6 నైట్స్ 

Advertisement
CJ Advs

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మస్కా, ఆట వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది డర్టీ హరి తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా ట్రెండీగా, అదే విధంగాయువతకు చక్కటి సందేశాన్నిస్తూ కొత్తగా ఉందని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ఎంఎస్ రాజు ప్రతిభను అందరూ ప్రశంసించారు. డర్టీ హరి వంటి బ్లాక్ బస్టర్  తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 7 డేస్ 6 నైట్స్ ఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా  7 డేస్ 6 నైట్స్. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ నెల 21(సోమవారం) హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు ‌ సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగ, అల్ట్రామోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని సుకున్నారు. ప్రస్తుత అగ్ర సంగీత దర్శకులలోఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

 ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్.ఎం మాట్లాడుతూ.. జూన్ 21న హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశాం. సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాం. ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డర్టీ హరి తర్వాత దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారుశ్రీకారం చుట్టారు. సాంకేతిక పరంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది అని అన్నారు. 

ఎంఎస్ రాజు మాట్లాడుతూ..  ఇదొక కూల్ అండ్ న్యూఏజ్ ఎంటర్టైనర్. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. డర్టీహరితో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతగా, దర్శకుడిగా.. నేనెప్పుడూ ఒకదానికి, మరొకదానికి పొంతన లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. డర్టీ హరి ఓ జానర్ సినిమా.‌ 7 డేస్ 6 నైట్స్ కూల్ ఎంటర్టైనర్. ఇందులో వినోదానికి మంచి అవకాశం ఉంది. లవ్, ఎమోషన్స్ ‌కి చక్కటి ఆస్కారం ఉంది. సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. పాటలు కొత్తగా ఉంటాయి అని అన్నారు.

 ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, పబ్లిసిటీ: ఈశ్వర్ అందే, సెకండ్ యూనిట్ డైరెక్టర్స్: అశ్విన్ కశ్యప్, యువి సుష్మ, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము, నిర్మాతలు:  సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

MS Raju Movie 7 Days 6 Nights:

MS Raju Movie 7 Days 6 Nights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs