Advertisement
Google Ads BL

మెఘా వాళ్ళు భారీ ఆస్పత్రి కైవసం.!


మెఘా కృష్ణా రెడ్డి భారీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని కొనుగోలు చేసేందుకు డీల్ కుదిరినట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు మధ్యనున్న ఈ పెద్ద ఆసుపత్రి  త్వరలో చేతులు మారనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతున్న మెఘా కృష్ణా రెడ్డి వైద్య రంగంలోకి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ ఆస్పత్రిని కొనుగోలు చేసేందుకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఏపీలోని విజయవాడ - గుంటూరు మధ్య మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆస్పత్రి కొనుగోలుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నారై మెడికల్ కాలేజీ, ఆస్పత్రి కొనుగోలుకు సుమారు రూ.650 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం.

ఎన్నారై ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ముక్కామల అప్పారావు ఇప్పటి వరకూ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. మేనేజ్‌మెంట్‌లో తలెత్తిన విభేదాల కారణంగా ఇరువర్గాలు పోలీస్ కేసులు పెట్టుకున్నాయి. కోర్టుల్లో కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు డాక్టర్ ముక్కామల అప్పారావు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మెఘా కృష్ణా రెడ్డి ఎన్నారై ఆస్పత్రిని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

సుమారు 250 ఎంబీబీఎస్, 150 పీజీ సీట్లున్న ఎన్నారై కళాశాలను 650 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మెఘా కృష్ణా రెడ్డితో భేటీ అయ్యేందుకు డాక్టర్ ముక్కామల అమెరికా నుంచి రానున్నట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పేరుగాంచిన ఎన్నారై ఆస్పత్రి చేతులు మారనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మెఘా సంస్థ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యతలు డాక్టర్ ముక్కామల చూసుకోవచ్చని తెలుస్తోంది.

NRI Medical college deal finalized:

Nri Medical college deal finalized with Megha Krishna Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs