Advertisement
Google Ads BL

స్టాండ‌ప్ రాహుల్లో శ్రేయారావుగా వ‌ర్ష‌బొల్ల‌మ్మ


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని  ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ  నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం స్టాండ‌ప్ రాహుల్‌. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌.

Advertisement
CJ Advs

ఇది జీవితంలో దేనికోసం క‌చ్చితంగా నిలబడని ఒక వ్య‌క్తి  నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం మ‌రియు అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నత‌న‌ అభిరుచిని చాటుకునే  స్టాండ్-అప్ కామిక్ కథ.

ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు  ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వ‌ర్ష కూడా శ్రేయా రావు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ రోల్ చేస్తుంది. డిఫ‌రెంట్ ఇమేజెస్‌తో ఉన్న వ‌ర్ష‌బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం,  శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు.

Varsha Bollamma First Look As Sreya Rao In Stand Up Rahul:

Varsha Bollamma First Look As Sreya Rao In Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs