Advertisement
Google Ads BL

హీరో లుక్ లో మహేష్ మేనల్లుడు ఎంట్రీ


సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్‌. 

Advertisement
CJ Advs

హీరో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరోగా పరిచయమవుతున్న తన మేనల్లుడు అశోక్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్. హీరో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో  ఫిట్‌ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అశోక్ గల్లా, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపిస్తున్న స్టార్ సింబల్, గన్ను, బుల్లెట్ మ‌రియు ఫిలిం రోల్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. 

అశోక్ కౌబాయ్ గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ తో `హీరో` సినిమా టైటిల్ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అలాగే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ గా నిలవనుంద‌ని తెలుస్తోంది. వెంట‌నే ఈ యంగ్ హీరో జోక‌ర్ గెట‌ప్‌లో క‌నిపించి అందర్నీ ఆశ్య‌ర్య‌పరిచారు. అలాగే అశోక్ హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే లవ్ స్టోరీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. టైటిల్ టీజ‌ర్‌లో బ‌ట్టి చూస్తే హీరో సినిమాల్లో కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక జోక‌ర్‌లుక్‌లో అశోక్ గ‌ల్లా క‌న్నింగ్ స్మైల్ టీజ‌ర్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. 

ఒక నిమిషం నిడివిగ‌ల టైటిల్ టీజర్ తో హీరో అశోక్ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ టైటిల్ టీజ‌ర్‌తో ప్రేక్షకుల మెప్పుపొందారు. అలాగే  శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ స్టైల్ కి మంచి  ప్ర‌శంస‌లు దక్కుతున్నాయి. 

ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కష్టం టైటిల్ టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ కూడా క్లాసీగా ఉంది. మంచి నిర్మాణ విలువలు,కెమెరామెన్ రిచర్డ్‌ ప్రసాద్‌ అద్భుతమైన పనితనం, జిబ్రాన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. హీరో సినిమా టైటిల్ టీజర్ ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు పెంచేసింది.

డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. 

Ashok Galla Debut as Hero:

Ashok Galla HERO teaser released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs