Advertisement
Google Ads BL

పీన‌ట్ డైమండ్ ట్రైలర్ విడుదల


ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా పీన‌ట్ డైమండ్ సినిమా ట్రైలర్ విడుదల..!

Advertisement
CJ Advs

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా పీన‌ట్ డైమండ్. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. పీన‌ట్ డైమండ్ టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. 

నటీనటులు: అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి న‌క్కా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శాని సాల్మాన్‌‌, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌, నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.

Click Here Video: Peanut Diamond Trailer Launch 

Director Krish Launched Trailer Of Peanut Diamond:

<span>Director Krish Launched Trailer Of Abhinav Sardhar Action Drama Peanut Diamond</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs