Advertisement
Google Ads BL

హాస్య రస వీరత్వం రాజబాబు


తెరమీద ధీర గంభీరత్వం - తెర వెనుక హాస్య రస వీరత్వం వెరసి రాజబాబు

Advertisement
CJ Advs

జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తూ, కన్నీళ్లను తుడిచివేస్తూ నలుగురితో నవ్వుతో, నవ్వులను పండిస్తూ ఆహ్లాదకరంగా  ఎవరు తమ జీవనాన్ని మలచుకుంటారో వారే ధీరోదాత్తులు. సుఖ దుఃఖాలు లేని జీవితం ఉండదు. కానీ విజయం వచ్చినప్పుడు పొంగిపోయి, అపజయం కలిగినప్పుడు కుంగిపోయే మనుషులు ఎందరో కనిపిస్తారు, కానీ జయాపజయాలు, సుఖదుఃఖాలు అతీతంగా తన చుట్టూ వున్న మిత్రులను కన్నీరు ఉబికేలా నవ్వించే అరుదైన నటుడు, ఆత్మీయ వ్యక్తి రాజబాబు. రాజబాబు అనగానే ఒకప్పటి హాస్య నట చక్రవర్తి అనుకునేరు. ఈ రాజబాబు తెలుగు సినిమా, టీవీలో అను నిత్యం ప్రేక్షకులను సమ్మోహపరిచే క్యారెక్టర్ నటుడు రాజబాబు. రాజబాబు తెర మీద చాలా గంభీరంగా కనిపిస్తాడు, ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయే తత్త్వం, ఆ పాత్రను పండించే మనస్తత్వం రాజబాబు ప్రత్యేకత. అవును రాజబాబు స్వతహాగా నటుడు, ఆయన మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు, శరీర కదలికలు చాలా సహజంగా  ఉంటాయి . అందుకే స్నేహితులు రాజబాబులో వున్న నటుణ్ని గుర్తించారు, ప్రోత్సహించాలనుకున్నారు. అలా రాజబాబు ప్రమేయం లేకుండానే రంగస్థలంపై కాలు మోపాడు. పుటుక్కు జర జెర డుబుక్కు మే, పూజకు వేళాయరా నాటకాలతో రాజబాబు నటుడుగా తన సత్తా చూపించాడు. ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు.

మనిషి తాను ఏమి కావాలనుకుంటాడో ఆదిశగా  సాగిపోతాడు. ఆ గమనంలో  తాను ఆశించింది సాధించి గమ్యం చేరవచ్చు లేదా పరాజయంతో అక్కడితో ఆప్రయాణం ఆగిపోవచ్చు. అయితే తన ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి  జీవితం సాగిపోతుందో దానికి ఓ గమ్యం, ఓ సార్ధకత ఉంటాయి. బహుశ దానినే అదృష్టం లేదా  విధి లిఖితం అంటారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేటలో జన్మిచిన రాజబాబు జీవితానికి ఓ అర్ధం, పరమార్ధం వున్నాయి కాబట్టే ఆయనలోని గొప్ప నటుణ్ణి దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు చూడగలిగారు. 1995లో  శ్రీకాంత్ హీరోగా నిర్మించిన ఊరికి మొనగాడు సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు. మొదట్లో స్నేహితులు రాజబాబు తమ ఊరికే మొనగాడు అనుకున్నారు. అయితే  ఆ తరువాత కాలంలో రాజబాబు తెరపైన సిందూరం, ఆడవారి మాటలు అర్ధాలే వేరులే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సముద్రం, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, భరత్ అనే నేను సినిమాల్లో పాత్రలు, టీవీ వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి, ప్రియాంక సీరియల్స్ లోని లో పోషించిన పాత్రలను చూసిన తరువాత రాజబాబు ను సినిమారంగంలో మొనగాడు అని ఊరి ప్రజలు, మిత్రులు గౌరవిస్తున్నారు.

సహజంగా గోదారొళ్ళ మాటల్లో  కాస్త వెటకారం ఉంటుందని అంటారు అయితే రాజబాబు లో మమకారం చాలా ఎక్కువ. ఎప్పుడూ నవ్వుతో నవ్విస్తూ వుండే అపురూపమైన వ్యక్తి. మంచి మాటకారి మాత్రమే కాదు అంతకు మించి ఆత్మీయతను పెంచి అందరికీ పంచే మనసున్న మిత్రుడు రాజబాబు. ఒక్కసారి రాజబాబు తో పరిచయం అయితే జీవితాంతం మర్చిపోలేని స్నేహశీలి రాజబాబు. ఈ ఇరవై ఐదేళ్ల లో 62 సినిమాలు, 48 సీరియళ్లు, ప్రభుత్వ నంది అవార్డు, ప్రైవేట్ సంస్థలు చేసిన సత్కారాలు ఎన్నో ఎన్నెనో రాజబాబు జీవితాల్లో మర్చిపోలేని మధుర స్మృతులు.. సాధించిన విజయాలు. నటుడుగా ఎప్పటికీ చెరిగిపోని చిరునామా! 

ఇవ్వాళ రాజబాబు గారి 64వ పుట్టినరోజు. ఆయన్ని అమితంగా అభిమానించి, ఆత్మీయతను పంచె మిత్రులకు పండుగ రోజు. రాజబాబు ఇక ముందు కూడా వెండి తెర, బుల్లి తెర మీద రాజబాబు లా వెలిగిపోవాలని అందరి ఆశ, ఆకాంక్ష.

Happy Birthday Raja Babu:

Happy Birthday Raja Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs