Advertisement
Google Ads BL

శ్రీవిష్ణు రాజరాజచోర అప్ డేట్


విలక్షణమైన కథలతో, పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరో శ్రీవిష్ణు.. తాజాగా మరో విభిన్నమైన చిత్రం రాజ రాజ చోర పరీక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  మేఘా ఆకాశ్‌ – సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్‌ తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన మేకర్స్‌.. ప్రచార చిత్రాల్లో చోర (దొంగ) అనే కొత్త అవతారంలో శ్రీవిష్ణు ను చూపించి సినిమాపై అంచనాలను పెంచారు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి సరికొత్త ప్రమోషనల్‌ స్ట్రాటజీతో రాజ రాజ చోర టీజర్‌ అప్డేట్‌ ఇచ్చారు. చోరగాథ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ వాయిస్‌ ఓవర్‌తో ఓ చిన్న 2డీ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్‌. ఇందులో చోరగాథ అంటూ గంగవ్వ ఓ కథ చెబుతుంది. అనగనగా.. భూమి నుంచి కోతి వచ్చింది.. బంగారం వచ్చింది. కోతి మనిషి అయ్యింది.. బంగారం కిరీటం అయ్యింది. మనిషి దొంగ అయ్యిండు.. కిరీటం రాజు అయింది.. అంటూ ఆహ్లాదకరమైన రాజు – దొంగ కథ చెప్పింది గంగవ్వ. అయితే రాజు కిరీటాన్ని దొంగ ఎత్తుకెళ్లిన తర్వాత ఏమి జరిగింది.. రాజు ఏమి చేసాడు.. దొంగ దొరికాడా లేదా అంటూ చెప్పిన గంగవ్వ.. రాజ రాజ చోర టీజర్‌ జూన్‌ 18న రాబోతున్నట్లు తెలిసేలా చేసింది. 

అసలు రాజు – దొంగ కథ ఏంటి? కిరీటం సంగతి ఏంటి అనేది టీజర్‌ లో చెప్పనున్నారు. అలాగే చోరగాధ చివర్లో వచ్చే రాజరాజు వచ్చే లోకాలు మెచ్చే.. రాజ రాజ చోర వచ్చే బాధలోన్నో తెచ్చే అంటూ వచ్చే డైలాగ్స్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి.

Raja Raja Chora movie update:

Sri Vishnu Raja Raja Chora movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs