Advertisement
Google Ads BL

కథ కంచికి మనం ఇంటికి ఫస్ట్ లుక్


యంగ్ హీరో ఆదిత్ అరుణ్  పుట్టిన‌రొజు సంద‌ర్బంగా విడుద‌లైన‌ కథ కంచికి మనం ఇంటికి మొద‌టిలుక్ కి అనూహ్య స్పంద‌న‌ 

Advertisement
CJ Advs

వ‌రుసగా మంచి చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో  అదిత్ అరుణ్ హీరోగా, పూజిత పొన్నాడ జంటగా MP ఆర్ట్స్ బ్యానర్‌పై చాణక్య చిన్న  ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం క‌థ కంచికి మ‌నం ఇంటికి. ఈ చిత్రం టైటిల్ ని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి సినిమా ల‌వ‌ర్స్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్గ్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. పక్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా  తెరకెక్కిస్తున్న  ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు.  ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. భీమ్స్ సిసిరాలియో సంగీతం అందించిన ఆడియొ అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతం గా ఆక‌ట్ట‌కునేలా ట్యూన్స్ ఇచ్చారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. హీరో అదిత్ అరుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్రం యోక్క మొద‌టి లుక్ ని యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ.. క‌థ కంచికి మ‌నం ఇంటికి అనే ఒక అద్బుత‌మైన టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. పూర్తి వైవిధ్యం గా ఈ క‌థ ని ద‌ర్శ‌కుడు చాణిక్య చిన్న మాకు చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ప్పుడే టైటిల్ ని అనుకున్నాం. మాకు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ క‌థ కి హీరో ఎవ‌రా అనుకున్న‌ప్పుడు మా అంద‌రి నోట ఒకే మాట అదిత్ అరుణ్ అని.. ఆయ‌న ఫెర్‌ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్ర‌తి సినిమాకి ఒదిగివుండి క‌థ లో పాత్రలో ఒదిగిపోతాడు . ఈ సినిమాతో మా ఫ్యామిలి మెంబ‌ర్ అయ్యిపోయాడు. క్లైమాక్స్ లో అదిత్ న‌ట‌న కి ప్రేక్ష‌కులు ధియోట‌ర్ లో ఊగిపోతారు ఇది నిజం.. మా హీరో అదిత్ అరుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా మా చిత్రం మొద‌టి లుక్ ని మొష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసాము. చాలా మంచి రెస్పాన్స్ రావ‌డం మా యూనిటిక్ ఆక్సిజ‌న్ ఇచ్చింది. అలాగే మా హీరోకి బ‌ర్త్‌డే గిప్ట్ ఇది. హ్య‌పి బ‌ర్త్‌డే టు అదిత్ అరుణ్‌. అని అన్నారు

నటీనటులు: అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్, గెటప్ శ్రీను తదితరులు.

సాంకేతిక నిపుణులు: బ్యానర్- యమ్. పి.ఆర్ట్స్, టైటిల్- కథ కంచికి మనం ఇంటికి, నిర్మాత- మోనిష్ పత్తిపాటి, దర్శకత్వం- చాణిక్య చిన్న, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- సుభాష్ డేవాబత్తిన, లైన్ ప్రొడ్యూసర్- కుమార్ కోట, మ్యూజిక్- బీమ్స్ సిసిరోలియో, డి.ఓ.పి- వైయస్ కృష్ణ, ఎడిటింగ్- ప్రవీణ్ పూడి, డైలాగ్స్- శ్రీనివాస్ తేజ, ఫైట్స్- షావోలిన్ మల్లేష్, వి.యఫ్ యక్స్- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి, పి.ఆర్.ఓ- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Click Here: Katha Kanchiki Manam Intiki Motion poster 

First look Katha Kanchiki Manam Intiki out now:

First look Katha Kanchiki Manam Intiki out now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs