Advertisement
Google Ads BL

విక్రమ్ చిత్రంలో పడిపోయా పడిపోయా పాట.


విక్రమ్ చిత్రంలో పడిపోయా పడిపోయా పాట.

Advertisement
CJ Advs

విక్రమ్ చిత్రంలోని పడిపోయా పడిపోయా.. అంటూ సాగే రెండవ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు. నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ బైర్రాజు సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో *శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు.

అనంతరం ముఖ్య అతిథి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రముఖ హీరో నాగార్జున గారు విక్రమ్ అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్ తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి.. అతను హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా. పడిపోయా పడిపోయా అనే ఈ పాట ప్రేమికులకు ఎంతో స్ఫూర్తిని కలిగించేలా ఆకట్టుకుంటోంది. నాగవర్మ చక్కటి అభినయంతో పాటలలో అలరింపజేస్తూ, ఫైట్స్ లోనూ కుమ్మేశాడు అని అన్నారు.

చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు మాట్లాడుతూ.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతం. ఈ పాట ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం కరెక్ట్ అనిపించింది. మా సినిమా పాటలు, టీజర్, పోస్టర్స్ పలువురు సినీ ప్రముఖుల ద్వారా విడుదల అవుతుండటం ఎనలేని ఆనందంగా ఉంది. టీం సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది అని అన్నారు.

దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. మ్యూజికల్ ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మిళితం చేసి నవ్యరీతిలో ఈ చిత్రాన్ని మలిచాం. విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్రల స్వరూప స్వభావాలను ఇందులో చూపించాం. ఇంకా చెప్పాలంటే సొసైటీలోని పాత్రలకు దగ్గరగా ఈ పాత్రలు ఉంటాయి.  తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏమి చేశాడన్నది ఆసక్తికరంగా చెప్పాం. థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం అని అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇందులోని ఐదు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చిందని చెప్పగా.. కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ, ఇందులో నాలుగు పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని అన్నారు.

నాగవర్మ బైర్రాజు, దివ్యాసురేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో  ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, నిర్మాత: నాగవర్మ బైర్రాజు, దర్శకత్వం హరిచందన్.

Click Here Video: Vikram Movie Audio Launch 

Vikram Movie Audio Launch:

vikram movie audio launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs