Advertisement
Google Ads BL

ఈ సింగిల్ చిన్నోడే అంటున్న పాగల్


టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి విశ్వ‌క్ సేన్ యువ‌త‌ను ఆక‌ర్షించే చిత్రాల‌నే ఎక్కువ‌గా ఎంచుకుంటున్నాడు. విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం పాగ‌ల్‌కి  కూడా యూత్‌లో మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఈ రోజు పాగ‌ల్ చిత్రం నుండి ఈ సింగిల్ చిన్నోడే.. పాటను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.  

Advertisement
CJ Advs

ఈ సింగ‌ల్ చిన్నోడే..న్యూ ల‌వ్వులో ఫ్రెష్షుగా ప‌డ్డాడే..సిగ్న‌ల్ గ్రీనే చూశాడే ప‌రుగులు పెట్టాడే అంటూ సాగే ఈ పాట సాహిత్యానికి త‌గ్గ‌ట్టుగా  హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. అతను ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సంద‌ర్భంలో వ‌చ్చే పాట అని తెలుస్తోంది.

ఈ సాంగ్‌లో సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖతో రొమాంటిక్ రిలేష‌న్‌షిప్‌లో విశ్వ‌క్ సేన్ క‌నిపిస్తున్నాడు. ఈ పెప్పీ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ధ‌న్‌ స్వ‌ర‌పర‌చ‌గా బెన్నీ దయాల్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఆల‌పించారు. కృష్ణ కాంత్ సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట‌లో విశ్వ‌క్ సేన్‌ మొదటిసారి త‌న డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ప్రదర్శించాడు.

Ee Single Chinnode Song From Paagal :

Ee Single Chinnode Song From Vishwak Sen Paagal Is Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs