Advertisement
Google Ads BL

జూన్‌ 18న ధనుష్‌ జగమే తంతిరం


ఎప్పటినుంచో ప్రేక్ష‌కులు అందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రం జగమే తంతిరం ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ రోజు (జూన్‌ 1) విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రకిట రకిట పాటకు శ్రోతల నుంచి అత్యద్భుతమైన స్పందన లభించింది. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్‌కి కూడా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన జగమే తంతిరం చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో తమిళ  గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ధనుష్‌ అదరగొట్టారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, వై నాట్‌ స్టూడియోస్‌ నిర్మించిన జగమే తంతిరం సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Advertisement
CJ Advs

జగమే తంతిరం చిత్రంలో ధనుష్, ఐశ్వర్యలక్ష్మీ, జోజు జార్జ్, కలైయారసన్, శరత్‌ రవి, జేమ్స్‌ కాస్మో ప్రధాన పాత్రలు పోషించారు. జగమే తంతిరం చిత్రంలో వీరి నటన వీక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇక ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ అందించిన సంగీతం మరో ఆకర్షణ అని చెప్పొచ్చు. కథ, కథనాలు, సంగీతం ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. చూపు తిప్పుకోలేని రితీలో ఈ సినిమా వీక్షకులను అలరించ‌నుంది. 208 మిలియన్ల వ్యూయర్స్‌ ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో జగమే తంతిరం ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 18న ప్రసారం కానుంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఈ సంద‌ర్భంగా

చిత్ర ద‌ర్శ‌కుడు కార్తిక్‌ సుబ్బరాజు మాట్లాడుతూ - జగమేతంతిరం సినిమా నా డ్రీమ్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. ఓ స్థానిక  ప్రాంతానికి చెందిన సాధార‌ణ వ్యక్తి అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? ఇందుకు దారి తీసిని ప‌రిస్థితులేంటి? అన్నదే ఈ చిత్రం మూల కథాంశం. ఇక న‌ట‌నలో ధనుష్‌ ప్రతిభ గురించి ప్రత్యేకించి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కూడా ధనుష్‌ స్టైల్‌ ఆఫ్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ గ్యారంటీగా ఆడియన్స్‌ను అలరిస్తుంది. 190 దేశాల్లో నెటిఫ్లిక్స్  ద్వారా ఈ చిత్రం వ్యూయర్స్‌ వీక్షించగలరు. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది అని అన్నారు

Jagame Thanthiram to premiere on Netflix on June 18th:

Dhanush Jagame Thanthiram to premiere on Netflix on June 18th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs