Advertisement
Google Ads BL

అల్లు వారబ్బాయి.. కొత్త సినిమా ముచ్చట్లు


కొత్త జంట‌, శీర‌స్తు శుభ‌స్తు, ఏబిసిడి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఒక్క క్ష‌ణం వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అనుఇమానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో 100% ల‌వ్, భలే భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది. 

Advertisement
CJ Advs

30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 6 ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నాను. ఈ వివ‌రాల‌ను తెలుపుతూ విడుద‌ల చేసిన ప్రీ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లు శిరీష్, అనుఇమానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ పోయేటిక్ స్టిల్ తో ఈ ప్రీ లుక్ ని సిద్ధం చేసి విడుద‌ల చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఈ ప్రీలుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రీలుక్ తో ఈ సినిమా పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు.

Allu Sirish announces his next with a pre-look poster :

Sirish 6 First Look May 30th at 11 am
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs