Advertisement
Google Ads BL

రికార్డుల వేటలో అల్లు అర్జున్


అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుని టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఇంట్రడక్షన్ వీడియో 

Advertisement
CJ Advs

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బబ్లీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో కు అద్భుతమైన స్పందన వస్తుంది. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీ లో అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియో గా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది.  1.4 మిల్లియన్ లైకులతో పాటు లక్ష పైన కామెంట్స్ కూడా ఈ వీడియో కు రావడం విశేషం. ఈ వీడియో లో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రేక్షకులకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

First glimpse of Pushpa touches 60 million views:

First glimpse of Allu Arjun- Sukumar Pushpa touches 60 million views
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs