Advertisement
Google Ads BL

రాజా కుటుంబానికి ఎఫ్‌సిఏ సహకారం!


గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, మ్యూజికాలజిస్ట్ స్వర్గీయ రాజా కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ఆదివారం స్వర్గీయ రాజా భార్య ఎం. పద్మావతిని కలిసి రాజా గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ సంగీత కుటుంబానికీ తీరని లోటు అని ఎఫ్.సి.ఎ. అధ్యక్షులు శ్రీ సురేశ్ కొండేటి వివరించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి తెలియచేశారు. రాజాగారూ లేకపోయినా వారి కుటుంబానికి అవసరమైన సాయం చేయడానికి ఎఫ్.ఎ.సి. ముందు ఉంటుందని జాయింట్ సెక్రెటరీ పర్వతనేని రాంబాబు చెప్పారు. స్వర్గీయ రాజా కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తనతో పాటు ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు వడ్డి ఓంప్రకాశ్ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

FCA support for Senior member Raja family!:

FCA support for Senior member Raja family!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs